AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washing Machine: అయ్యో ఎంత ఘోరం.. ప్రతీకారంతో రగిలిపోయిన ఓ తల్లి ఎంతకు తెగించిందో చూడండి..!

తమిళనాడులోని తిరునెల్వేలిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ అభం శుభం తెలియని పసికందును దారుణంగా హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు మృతదేహాన్ని తన ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌లో దాచింది. పసివాడు కనిపించక ఊరంతా వెతికిన చిన్నారి తల్లిదండ్రులు.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ దారుణ ఘటన సోమవారం..

Washing Machine: అయ్యో ఎంత ఘోరం.. ప్రతీకారంతో రగిలిపోయిన ఓ తల్లి ఎంతకు తెగించిందో చూడండి..!
Woman Kills Neighbour's Boy
Srilakshmi C
|

Updated on: Sep 10, 2024 | 11:13 AM

Share

చెన్నై, సెప్టెంబర్‌ 10: తమిళనాడులోని తిరునెల్వేలిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ అభం శుభం తెలియని పసికందును దారుణంగా హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు మృతదేహాన్ని తన ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌లో దాచింది. పసివాడు కనిపించక ఊరంతా వెతికిన చిన్నారి తల్లిదండ్రులు.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ దారుణ ఘటన సోమవారం (సెప్టెంబర్‌ 9) రాధాపురం పోలీస్‌ పరిధిలోని పరిధిలోని ఆతుకురిచ్చి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడులోని తిరునెల్వేలిలో ఆతుకురిచ్చి గ్రామంలో తంగమ్మాళ్ (40) అనే మహిళ జీవనం సాగిస్తోంది. ఆమె బిడ్డ కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే తన పక్కింటిలో ఉన్న విఘ్నేష్‌ అనే వ్యక్తి వల్ల తంగమ్మాళ్ బిడ్డను కోల్పోయవల్సి వచ్చింది. చనిపోయిన బిడ్డను తల్లుకుని కుమిలిపోతున్న తంగమ్మళ్.. పొరుగింటి విఘ్నేశ్‌పై పగను పెంచుకుంది. ప్రతీకారంతో రగిలిపోసాగింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం విఘ్నేష్‌ ఇంటిలోని అంగన్‌వాడీ స్కూల్‌కి వెళ్లే బాలుడు సంజయ్‌ కనిపించకుండా పోయాడు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న సంజయ్‌ని అంగన్‌వాడీకి తీసుకెళ్లేందుకు తల్లి రమ్మ ప్రయత్నించింది. అయితే ఇళ్లంతా వెతికినా కనిపించలేదు. ఈ విషయం గుర్తించిన రమ్య భర్త విఘ్నేష్‌కు సమాచారం అందించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. చీకటి పడుతున్న కుమారుడు కనిపించకపోవడంతో విఘ్నేష్ కుటుంబీకులు రాధాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ బిడ్డ కనిపించకుండా పోవడంపై పొరుగింట్లో ఉంటున్న తంగమ్మాళ్‌ హస్తం ఉందన్న సందేహాలను కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తంగమ్మాళ్‌ ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌లో బాలుడు సంజయ్‌ మృతదేహాన్ని గుర్తించారు. తంగమ్మాళ్ చిన్నారిని మెషీన్‌లో దాచే ముందు గోనె సంచిలో చుట్టి పెట్టింది. అనంతరం వాషింగ్‌ మెషిన్‌లో దాచింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితురాలైన మహిళ తన బిడ్డ చనిపోయినప్పటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.