Telangana: బడిలో ఒకటో తరగతి విద్యార్ధికి పాముకాటు.. విషాన్ని నోటితో లాగి ప్రాణాలు నిలబెట్టిన టీచర్‌

ఆదిలాబాద్‌ జిల్లా దనోర మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం వరండాలో చివర వరుసలో కూర్చున్న ఒకటో తరగతి బాలుడిని ఓ విష సర్పం కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయుడు క్షణాల్లో స్పందించి..

Telangana: బడిలో ఒకటో తరగతి విద్యార్ధికి పాముకాటు.. విషాన్ని నోటితో లాగి ప్రాణాలు నిలబెట్టిన టీచర్‌
Snake Bite
Follow us

|

Updated on: Sep 10, 2024 | 6:55 AM

భీంపూర్, సెప్టెంబర్‌ 10: ఆదిలాబాద్‌ జిల్లా దనోర మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం వరండాలో చివర వరుసలో కూర్చున్న ఒకటో తరగతి బాలుడిని ఓ విష సర్పం కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయుడు క్షణాల్లో స్పందించి బాలుడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకెళ్తే..

స్కూల్‌ వరండాలో కూర్చున్న ఒకటో తరగతి విద్యార్ధి మామిడి యశ్వంత్‌ను పాము కాటేసింది. ఉపాధ్యాయుడు గుమ్మడి సురేశ్‌ వెంటనే బాలుడికి ప్రథమ చికిత్స చేశారు. పాము కాటేసిన భాగంలో నోటితో విషాన్ని లాగి ప్రథమ చికిత్స చేసి, కట్టు కట్టారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు సంతోష్‌, సుజాతలకు సమాచారం అందించడంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. బాలుడు యశ్వంత్‌ను హెచ్‌ఎం హన్మాండ్లు, బాలుడి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై హుటాహుటిన భీంపూర్‌ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని రిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్య కేంద్రం సిబ్బంది సూచించారు.

సమయానికి అంబులెన్సు కూడా లేకపోవడంతో ద్విచక్ర వాహనంపైనే బాలుడిని ఆదిలాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వైద్యులు హుటాహుటీన చికిత్స ప్రారంభించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. భీంపూర్‌ ఆరోగ్య కేంద్రం వైద్యుడు నిఖిల్‌రాజ్‌ విధుల్లో లేకపోవడంపై వివరణ కోరగా.. తాను గిరిగాం ఉపకేంద్రం సందర్శనలో ఉన్నట్లు తెలిపారు. అక్కడి అంబులెన్సు మరో చోటకు వెళ్లిందని, అందుకే వేళకు అంబులెన్స్‌ సదుపాయం కల్పించలేకపోయామని ఆయన అన్నారు. విద్యార్థిని కాటేసిన పాము విషసర్పమా? కాదా? అనే విషయం రక్త పరీక్షలో తేలుతుందని ఆయన తెలిపారు. అయితే అందుకు కొంత సమయం పడుతుందని, అందుకే రిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని తమ సిబ్బంది సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.