Telangana: కొత్త పీసీసీ కార్యవర్గంపై మొదలైన కసరత్తు.. వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎవరెవరు అంటే..

పీసీసీ అధ్యక్షుడు గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మహేష్ కుమార్ గౌడ్ పాత కార్యవర్గాన్ని మొత్తాన్ని రద్దు చేసి కొత్త కమిటీ ని ఏర్పాటు చేసుకోవడం కోసం కసరత్తును ఇప్పటికే ప్రారంభించాడు.ఇప్పటికే పార్టీలో సమన్యాయం కొరవడిందని తమ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వట్లేదని ధిక్కార స్వరం వినిపిస్తున్న నేతలు ,మరొక వైపు కార్పొరేషన్లలో అవకాశం..

Telangana: కొత్త పీసీసీ కార్యవర్గంపై మొదలైన కసరత్తు.. వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎవరెవరు అంటే..
Pcc President
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Sep 10, 2024 | 6:50 AM

పీసీసీ అధ్యక్షుడు గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మహేష్ కుమార్ గౌడ్ పాత కార్యవర్గాన్ని మొత్తాన్ని రద్దు చేసి కొత్త కమిటీ ని ఏర్పాటు చేసుకోవడం కోసం కసరత్తును ఇప్పటికే ప్రారంభించాడు.ఇప్పటికే పార్టీలో సమన్యాయం కొరవడిందని తమ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వట్లేదని ధిక్కార స్వరం వినిపిస్తున్న నేతలు ,మరొక వైపు కార్పొరేషన్లలో అవకాశం దక్కని నేతలు కూడా పార్టీ పదవులకు పోటీ పడుతున్నారు, మరి మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా తన సహచరుల ను ఎంపిక చేస్తారనేది పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది.

కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం కసరత్తు ను ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ హై కామాండ్ ను సంప్రదించి ఒక లిస్ట్ ను ముందు పెట్టి ఆమోదింప జేసీ ప్రకటిస్తారు. నేపథ్యంలో సీనియర్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ గా దాదాపు ఖరారు అయిందని తెలుస్తుంది. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్ట్ లకోసం వర్కింగ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి , సునీత రావు సరితా తిరుపతయ్య, బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.

త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ లతో అపాటు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధులను నియమించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తాడాని తెలుస్తుంది. మరొక వైపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలిపించి మహేష్ కుమార్ గౌడ్ తన సత్తా చాటాల్సి ఉంటది. మరి మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా పార్టీని ముందు కు నడిపించి తాన మార్క్ ను చూపిస్తాడో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి