Andhra Pradesh: గణేష్ మండపంలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. క్షణాల్లో మృతి
వినాయక చవితి పండగ సందర్భంగా పలు చోట్ల విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వినాయకుడి మండపంలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. గంగమ్మ ఆలయానికి సమీపంలోని మండపంలో అశోక్ (32) అలియాస్ లోబో అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న..
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 10: వినాయక చవితి పండగ సందర్భంగా పలు చోట్ల విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని వినాయకుడి మండపంలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. గంగమ్మ ఆలయానికి సమీపంలోని మండపంలో అశోక్ (32) అలియాస్ లోబో అనే యువకుడు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అశోక్ పెయింటర్‌గా పనిచేసేవాడు. విచిత్ర వేషధారణ, కేశాలంకరణలతో వేడుకల్లో నృత్యం చేస్తూ అలరిస్తూ ఉండేవాడు. కాగా అశోక్‌కు భార్య ఉంది. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. భర్త అకాల మరణంతో మృతుడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.
వేర్వేరు చోట్ల గణేశ్ నిమజ్జనాల్లో ఐదుగురు గల్లంతు.. ముగ్గురు మృతి
తిరుపతి, వైఎస్సార్ జిల్లాల్లో గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో సోమవారం ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృత్యువాత పడగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరో వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. వివరాల్లోకి వెళితే… తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కి సుమారు 20 మంది యువకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకొచ్చారు. సముద్రంలో స్నానాలు చేస్తున్న క్రమంలో మునిరాజ, ఫయాజ్, శ్రీనివాసులు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. గమనించిన పోలీసులు శ్రీనివాసులు, ఫయాజ్‌లను ఒడ్డుకు చేర్చారు. శ్రీనివాసులు ప్రాణాలతో బయట పడగా, ఫయాజ్(22) వాకాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇక మునిరాజ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
మరో చోట.. వైఎస్సార్ జిల్లా వేంపల్లె పట్టణానికి చెందిన యువకులు వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేసేందుకు వీరపునాయునిపల్లె మండలంలోని ఎన్.పాలగిరి క్రాస్ వద్ద ఉన్న మొగమూరు వాగు వద్దకు వచ్చారు. అయితే వినాయకుడి ప్రతిమను నీటిలోకి వదులుతున్న క్రమంలో వంశీ (25), రాజా (40) వాగులో పడిపోయారు. ఎస్‌ఐ మంజునాథ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో పులివెందుల నుంచి ఫైర్ సిబ్బందిని పిలిపించారు. వీరు ఐదు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు.