AP Schools Reopen: నేటి నుంచి పునఃప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలలు

వేసవి సెలవులు పూర్తవడంతో ఈ రోజు (జులై 5) నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరపు బోధనాభ్యసన కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో సమగ్రంగా కొనసాగించేలా పాఠశాల విద్యాశాఖ..

AP Schools Reopen: నేటి నుంచి పునఃప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలలు
School Studets
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Jul 05, 2022 | 11:52 AM


Andhra Pradesh Schools Reopen: వేసవి సెలవులు పూర్తవడంతో ఈ రోజు (జులై 5) నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సమ్మర్లో ఆడి పాడి గంతులేసిన స్కూల్ పిల్లలు నేటి నుంచి మళ్లీ బడిబాటి పట్టారు. ప్రభుత్వ,ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47, 40, 421 మంది విద్యార్ధిని, విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. రూ.931.02 కోట్ల ఖర్చుతో  కిట్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2022–23 విద్యా సంవత్సరపు బోధనాభ్యసన కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో సమగ్రంగా కొనసాగించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. ఏ రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టాలో అందులో పొందుపరిచింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 9 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

కాగా ఈ ఏడాది పాఠశాలలు 22 రోజుల ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. విద్యార్ధులకు పంపిణీ చేయవల్సిన పాఠ్యపుస్తకాలు, యూనీఫాం, బూట్లు, బ్యాగ్‌లు, డిక్షనరీలు సకాలంలో బడులకు చేరకపోవడంతో ఆలస్యంగా స్కూళ్లు తెరచుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1-10 తరగతి వరకు 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు క్షేత్రస్థాయికి 70 శాతం చేరాయి. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ చేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 47.40 లక్షల మంది విద్యార్థులకు అందించాల్సిన బూట్లు, యూనీఫాం 30 శాతం మాత్రమే సరఫరా అయ్యాయి. బ్యాగ్‌లు 60 శాతం, నిఘంటువులు 50 శాతంలోపే చేరాయి.

అరకొర వసతులతోనే మోగనున్న బడి గంటలు..
ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యంగా జూన్‌ చివరి వారంలో మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 330 రకాల టైటిళ్లను 3.38 కోట్లు అందించాల్సి ఉండగా.. మరో కోటికిపైగా జిల్లాలకు చేరాల్సి ఉంది. మండల కేంద్రాలకు వచ్చిన పుస్తకాల్లోనూ అన్ని టైటిళ్లు లేవు. దీంతో ఉన్నవాటితోనే కిట్లను సిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు సైతం పాఠ్యపుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఒక్క పుస్తకాన్ని అందించలేదు. విద్యా కానుకను పాఠశాలలు పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందించాల్సి ఉండగా.. సామగ్రి సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొంది. ప్రభుత్వం నిర్ణయం కారణంగా కొంతమంది విద్యార్థులకు జులై నెలాఖరు వరకూ పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక కిట్టు అందే పరిస్థితి లేదు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారి వివరాలను జులై 15లోపు అందించాలని, వీరికి సెప్టెంబరు 15లోపు విద్యా కానుక అందిస్తామని వెల్లడించింది.

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, ‘నాడు-నేడు’ పనులు, విద్యా కానుక కిట్ల సరఫరా సరిగా లేకపోవడంతో పాఠశాలల పునఃప్రారంభాన్ని జులైకి వాయిదా వేశారు. ఇప్పుడు విద్యా కానుక సామగ్రి సరఫరా సరిగా లేకపోవడంతో పంపిణీని నెలాఖరు వరకు పొడిగించారు.తొలి రోజునే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్టూడెంట్‌ కిట్ల పంపిణీ ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రూ. 931.02 కోట్లతో ఈ కిట్లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్ల విద్యార్థులందరికీ అందిస్తారు. ప్రభుత్వం స్కూళ్లను ఆరంచెల నూతన జాతీయ విద్యా విధానం కింద మార్పులు చేసింది. నూతన విధానంలోనే స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

ప్రభుత్వ బడుల్లో 100 శాతం చేరికలకు కార్యచరణ
ఈ సంవత్సరంలో 220 రోజుల పాటు స్కూళ్లు పనిచేస్తాయి. పాఠశాలలల ప్రారంభానికి జూన్‌ 28వ తేదీ నుంచే స్కూల్‌ రెడీనెస్‌ కార్యక్రమాన్ని విద్యా శాఖ చేపట్టింది. దీనిలో భాగంగా ప్రతి పాఠశాలను శుభ్రం చేయించడం, మంచినీటి సదుపాయం ఏర్పాటుతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామాల్లోని పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం విద్యా పరంగా అమలుచేస్తున్న పథకాలను తల్లిదండ్రులకు వివరించి బడి ఈడు పిల్లలందిరినీ 100 శాతం చేర్పించేలా చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu