CUET PG 2022: సీయూఈటీ పీజీ 2022 దరఖాస్తు గడువు మరోమారు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలకు నిర్వహించనున్న సీయూఈటీ పీజీ 2022 (CUET PG 2022)కు దరఖాస్తు గడువును ఎన్టీఏ మరోమారు పొడిగించింది. తాజా ప్రకటనతో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవడానికి..

CUET PG 2022: సీయూఈటీ పీజీ 2022 దరఖాస్తు గడువు మరోమారు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
Cuet Pg 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2022 | 8:47 AM

CUET PG 2022 application last date: సెంట్రల్‌ యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలకు నిర్వహించనున్న సీయూఈటీ పీజీ 2022 (CUET PG 2022)కు దరఖాస్తు గడువును ఎన్టీఏ మరోమారు పొడిగించింది. తాజా ప్రకటనతో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవడానికి జులై 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. కాగా 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ప్రక్రియ మే 19న ప్రారంభమయ్యింది. ఐతే జులై 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పలు కారణాల రిత్యా మరోమారు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ ఫీజు జులై 11 వరకు చెల్లించవచ్చని ఈ మేరకు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ cuet.nta.nic.in లేదా uet.samarth.ac.in.లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం జులై 12 నుంచి 14వ తేదీ రాత్రి 11 గంటల 50 నిముషాల వరకు దరఖాస్తుల్లో ఏవైనా వివరాలను తప్పుగా నమోదు చేసుకుని ఉంటే సవరించు కోవడానికి అవకాశం కల్పించింది. ఇక సీయూఈటీ పీజీ టెస్ట్‌ 2022 జులై చివరి వారంలో, ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుందని ఎన్టీఏ ప్రకటించినా.. పరీక్ష తేదీని మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు.

యూజీసీ ఈ ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. క్వశ్చన్‌ పేపర్‌ హిందీ లేదా ఇంగ్లీష్ ల్యాంగ్వేజుల్లో మాత్రమే ఉంటుంది. ఇతర అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్‌ చేసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా ఎన్టీఏ తెల్పింది. సందేహాల నివృతి కోసం 011 4075 9000 హెల్ప్ డెస్క్‌కి కాల్ చేయవచ్చు లేదా cuet-pg@nta.ac.in ఈమెయిల్‌ ద్వారా తెలియజేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.