YSR Aarogyasri Recruitment 2022: పశ్చిమ గోదావరిలోని ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు.. అర్హతలివే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (YSR Aarogyasri Health Care Trust).. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ పోస్టుల (Arogya Mitra Posts) పోస్టుల భర్తీకి..

YSR Aarogyasri Recruitment 2022: పశ్చిమ గోదావరిలోని ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు.. అర్హతలివే..
Ysr Aarogyasri
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 03, 2022 | 1:25 PM

West Godavari YSR Aarogyasri Health Care Trust Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (YSR Aarogyasri Health Care Trust).. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ పోస్టుల (Arogya Mitra Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ఆరోగ్య మిత్ర పోస్టులు: 9
  • టీమ్‌ లీడర్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.18,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ (నర్సింగ్‌)/ఎమ్మెస్సీ (నర్సింగ్‌)/బీఫార్మసీ/ఎంఫార్మసీ/ ఫార్మా డీ/బీఎస్సీ (ఎంఎల్‌టీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కమ్యునికేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.