Harbhajan Singh Birthday: 42వ వసంతంలోకి భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్.. స్పిన్ బౌలింగ్‌తో కీర్తి శిఖరాలకు..

భారత క్రికెట్‌ చరిత్రలో వెటరన్‌ స్పిన్నర్, టర్బనేటర్‌గా పేరుగాంచిన హర్భజన్ సింగ్ దేశ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ రోజు (జులై 3) పుట్టిన రోజు జరుపుకుంటున్న హర్భజన్..

Harbhajan Singh Birthday: 42వ వసంతంలోకి భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్.. స్పిన్ బౌలింగ్‌తో కీర్తి శిఖరాలకు..
Harbhajan Singh
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 03, 2022 | 11:45 AM

Harbhajan Singh 42nd Birthday Special: భారత క్రికెట్‌ చరిత్రలో వెటరన్‌ స్పిన్నర్, టర్భోనేటర్‌గా పేరుగాంచిన హర్భజన్ సింగ్ దేశ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ రోజు (జులై 3) పుట్టిన రోజు జరుపుకుంటున్న హర్భజన్ 42వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా హర్భజన్‌ కెరీర్‌లో సాధించిన కొన్ని కీలక విజయాలు మీకోసం..

  • హర్భజన్ తన కెరీర్‌లో భారత జట్టు తరపున ఎన్నో కీలక మ్యాచుల్లో సత్తా చాటాడు.
  • 2011లో భారత్‌ తొలి టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్‌లను గెలవడంలో హర్భజన్ కీలకపాత్ర పోషించాడు.
  • 236 వన్డేలు, 103 టెస్టుల్లో ఆడిన హర్భజన్ దాదాపు ఒక దశాబ్దం పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించాడు.
  • తన 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు గత ఏడాది డిసెంబర్‌లో రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
  • 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ విజయం సాధించడంలో భజ్జీ కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో 20 ఏళ్ల హర్భజన్ స్పిన్ బౌలింగ్‌కు యావత్‌ ప్రపంచం ఫిదా అయ్యింది.
  • 2011లో వెస్టిండీస్‌పై 400 వికెట్లు పడగొట్టి తొలి భారతీయ ఆఫ్ స్పిన్నర్‌గా హర్భజన్ నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో హర్భజన్ 15వ స్థానంలో నిలిచాడు.
  • 2001లో భారతదేశం-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో హర్భజన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికవడంతోపాటు, టెస్ట్‌ హ్యాట్రిక్‌ సాధించిన తొలి భారతీయ క్రెకెటర్‌గా నిలిచాడు.

ఇక ఇండియన్‌ ప్రీమియం లీగ్‌ (ఐపిఎల్‌)లో హర్భజన్ 163 మ్యాచుల్లో 150 స్కాల్ప్స్‌తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఐదో స్థానంలో నిలిచాడు. హర్భజన్‌ కెరీర్‌లో 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు