IND vs ENG: టీమిండియాకు గుడ్‌న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న హిట్‌మ్యాన్.. పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధం..

జులై 7 నుంచి 17 వరకు ఇంగ్లండ్‌తో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్ ఆడనుంది.

IND vs ENG: టీమిండియాకు గుడ్‌న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న హిట్‌మ్యాన్.. పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధం..
Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jul 03, 2022 | 11:14 AM

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2022(T20 World Cup 2022) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత జట్టు కూడా నిరంతరంగా టీ20 సిరీస్‌లు ఆడడంలో నిమగ్నమై ఉంది. తాజాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో టీమిండియా సత్తా చాటింది. ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో టీమిండియా సిరీస్ దక్కించుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లాండ్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కరోనా కారణంగా బర్మింగ్‌హామ్ టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ ఫిట్‌గా మారి జట్టులో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

‘రోహిత్ శర్మ దాదాపుగా ఫిట్‌గా ఉన్నాడని, త్వరలో జట్టులో చేరతాడని బీసీసీఐకి సన్నిహిత వర్గాలు తెలిపినట్లు’ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్వరలో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మ పూర్తిగా సిద్ధమయ్యాడని తెలుస్తోంది. జులై 7, 9, 10 తేదీల్లో ఇక్కడ ఇంగ్లండ్‌తో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత, వన్డే సిరీస్, ఆ తర్వాత వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా రోహిత్ శర్మ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆడలేకపోయాడు. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే దీనికి ముందు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించిన టీ20, వన్డే సిరీస్‌లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అంటే టీ20, వన్డే సిరీస్‌లు ఆడేందుకు రోహిత్ శర్మ పూర్తిగా సిద్ధమవుతాడని బోర్డు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వైట్ బాల్ సిరీస్ కోసం భారత జట్టు..

తొలి టీ20ఐ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

2వ, 3వ టీ20ల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (కీపర్), రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.

3 వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, అక్షర్ బి పటేల్ , ప్రముఖ కృష్ణ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.