Andhra Pradesh: 2,588 మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్‌!

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 2,588 పోస్టుల భర్తీకి జగన్‌ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో..

Andhra Pradesh: 2,588 మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్‌!
Andhra Pradesh
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 03, 2022 | 9:34 AM

AP govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 2,588 పోస్టుల భర్తీకి జగన్‌ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు, కొత్తగా సృష్టించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరి రవిచంద్ర జులై 1న ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం పోస్టుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టులు 446, డెంటల్‌ సర్జన్‌ పోస్టులు 30 ఉన్నాయి. ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మిగిలిన పోస్టులను పదోన్నతి, ఒప్పంద విధానాల్లో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీటిలో ప్రధానంగా పోస్టుమార్టమ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 348, థియేటర్‌ అసిస్టెంట్ పోస్టులు 279, ల్యాబ్‌ టెక్నీషియన్ పోస్టులు 235, స్టాఫ్‌నర్స్ పోస్టులు 55, ఫార్మసిస్టు గ్రేడ్‌ 1 పోస్టులు 74, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ పోస్టులు 684 , కౌన్సెలర్ పోస్టులు 52లతో ఇతక పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. త్వరలో అధికారిక నోటిఫకేషన్‌ విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా సెక్రటరి రవిచంద్ర పేర్కొన్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.