TS TRT 2022: ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల ఎదురుచూపు
తెలంగాణ టెట్ 2022 ఫలితాలు విడుదలైనా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సర్కార్ ఊసెత్తక పోవడంపై సర్వత్రా చర్చ నెలకొంది..
Telangna TRT Recruitment 2022: తెలంగాణ టెట్ 2022 ఫలితాలు విడుదలైనా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నియామక నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోవడంపై టెట్ అభ్యర్ధుల్లో చర్చ నెలకొంది. ప్రభుత్వ బడుల్లో దాదాపు 11000ల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, బోధనేతర సిబ్బంది పోస్టులతో కలిపి మొత్తం విద్యాశాఖలో 13,086 కొలువులున్నాయి. వీటిల్లో ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాలు 6,400 వరకు ఉండనున్నాయి. 6 నుంచి 10 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు 3,600 వరకు ఖాళీలుంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ రకంగా చూస్తే స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీచేసే ఉద్యోగాల సంఖ్య 10,000ల వరకు ఉంటాయి. ఐతే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు విద్యాశాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. సాధారణంగా తెలంగాణ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TS TRT) ద్వారా ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వివిధ శాఖల్లో నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖలో కూడా కొలువుల భర్తీకి ముందుగా టెట్ నిర్వహిస్తామని, ఆ తర్వాత ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపడుతామని సర్కార్ పేర్కొంది. ఐతే ఇంతవరకు విద్యాశాఖ ఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.