CBSE Class 10th Results 2022: సీబీఎస్సీ టర్మీ 2 ఫలితాలు నేడు లేనట్లే.. ఎందుకంటే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్‌ 2 పరీక్షల ఫలితాలు ఈ రోజు (జులై 4) విడుదల చేయడంలేదని బోర్డు అధికారిక వర్గాలు సోమవారం (జులై 4) తెలిపాయి. ఫలితాల ప్రకటన తేదీని సీబీఎస్సీ బోర్డు..

CBSE Class 10th Results 2022: సీబీఎస్సీ టర్మీ 2 ఫలితాలు నేడు లేనట్లే.. ఎందుకంటే..
Cbse Results
Follow us

|

Updated on: Jul 13, 2022 | 4:53 PM

CBSE Class 10th Term 2 Result 2022 updates: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్‌ 2 పరీక్షల ఫలితాలు ఈ రోజు (జులై 4) విడుదల చేయడంలేదని బోర్డు అధికారిక వర్గాలు సోమవారం (జులై 4) తెలిపాయి. ఫలితాల ప్రకటన తేదీని సీబీఎస్సీ బోర్డు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ కొన్ని సామాజిక మాధ్యమాల్లో జులై 4 (సోమవారం)న సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదలవుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పంధించిన అధికారిక వర్గాలు నేడు ఫలితాలు ప్రకటించడంలేదని స్పష్టం చేశాయి. జులై 13వ తేదీన (బుధవారం) 10వ తరగతి ఫలితాలు, జులై 15న 12వ తరగతి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు కొత్తగా ఆవిష్కరించిన పరీక్ష సంగమ్‌ వెబ్‌ పోర్టల్‌ http://parikshasangam.cbse.gov.in/.లో 12వ తరగతి ఫలితాలు ప్రకటించనున్నారు.

కాగా 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మే 24 వరకు దేశ వ్యాప్తంగా 75 సబ్జెక్టులకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 21 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ప్రాక్టికల్స్‌, థియరీలతో కలిపి 33 శాతం, ఆపైన మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా బోర్డు ప్రకటిస్తుంది. సీబీఎస్సీ 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలకు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారా.. అని విద్యార్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్‌డేట్ల కోసం వెబ్‌సైట్‌ cbse.gov.in లేదా cbseresults.nic.in.ను తనిఖీ చేయవల్సిందిగా అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.