Viral video: పంజాబ్ మ్యూజిక్‌కు బ్రిటన్‌ స్టూడెంట్‌ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో..

ఓ కాలేజీ కల్చరల్‌ ఫెస్టివల్‌లో టీనేజ్‌ యూకే స్టూడెంట్‌ డ్యాన్స్‌ చేస్తూ అందరి మనసులను గెలుచుకున్నాడు. మీరూ చూడండి..

Viral video: పంజాబ్ మ్యూజిక్‌కు బ్రిటన్‌ స్టూడెంట్‌ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో..
Uk Student Dance
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2022 | 9:40 AM

Punjabi music famous world wide: భాష, వర్గ, లింగ బేధాలులేకుండా అందరినీ ఏకం చేసే మహత్యం ఒక్క మ్యూజిక్‌కే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అది వాస్తవం అని నిరూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ కాలేజీ కల్చరల్‌ ఫెస్టివల్‌లో టీనేజ్‌ యూకే స్టూడెంట్‌ డ్యాన్స్‌ చేస్తూ అందరి మనసులను గెలుచుకున్నాడు. మీరూ చూడండి..

బ్రిటన్‌లోని ఓ కాలేజ్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పంజాబ్‌ మ్యూజిక్‌కు యూకే స్టూడెంట్‌ మొదట డ్యాన్స్‌ చేయడం ప్రారంభిస్తాడు. చుట్టూ భిన్న వేషధారణల్లో ఉన్న విద్యార్దులు అతని డ్యాన్స్‌కు చప్పట్లు కొడుతూ ఉంటారు. కొంత సమయానికి డోల్‌ వాయించడం ప్రారంభించగానే విద్యార్థులందరూ తమ స్వదేశాల జెండాలతో డ్యాన్స్‌ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. సన్నీ హుండాల్ అనే యూజర్‌ ‘మోడ్రన్‌ బ్రిటన్‌’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌కు కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రెండు మిలియన్ల కు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇక లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

‘భిన్న సంస్కృతులకు చెందిన విద్యార్ధులు ఒకే విధమైన మ్యూజిక్‌కు ఉల్లాసంగా డ్యాన్స్‌ చేయడం అద్భుతంగా ఉందని’ ఒకరు, ‘పంజాబ్‌ మ్యూజిక్‌కు వింటే ఎవరైనా డ్యాన్స్‌ చేయాల్సిందేనని’ మరొకరు, ‘నేటి యువత మా జనరేషన్‌ కంటే ఎంతో ప్రొగ్రెస్సివ్‌గా ఉన్నారని’ ఇంకొకరు సరదాగా కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మీ అభిప్రాయం ఏమిటి..?