TS PGECET 2022: తెలంగాణ పీజీఈసెట్‌ 2022 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

2022-23 విద్యా సంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించనున్న తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS PGECET)కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి (TSCHE) సోమవారం (జులై 4) ప్రకటన..

TS PGECET 2022: తెలంగాణ పీజీఈసెట్‌ 2022 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
TS PGECET 2022
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 11:54 AM

TS PGECET 2022 application last date: 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించనున్న తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS PGECET)కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి (TSCHE) సోమవారం (జులై 4) ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా జులై 10 వరకు పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ pgcet.tsche.ac.in.లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.1000లు చెల్లించవల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన హాల్‌ టికెట్లు జులై 20 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీసెట్‌ 2022 ప్రవేశ పరీక్షలు జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఇతర పూర్త సమాచారం కోసం https://pgecet.tsche.ac.in/UI/ImportantDates.aspxలో చెక్‌ చేసుకోవచ్చు.

పీజీఈసెట్‌ 2022లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఎమ్‌ఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఎంఆర్క్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!