AIIMS Jobs: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో టీచింగ్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

AIIMS Bibinagar Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎయిమ్స్‌ బీబీ నగర్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు...

AIIMS Jobs: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో టీచింగ్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 03, 2022 | 9:20 PM

AIIMS Bibinagar Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎయిమ్స్‌ బీబీ నగర్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో ఉన్న ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ ఏయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 94 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్ (29), అడిషనల్‌ ప్రొఫెసర్ (11), అసోసియేట్ ప్రొఫెసర్ (18), అసిస్టెంట్ ప్రొఫెసర్ (36) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీతో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంబీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌ డీఎం ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి.

* ప్రొఫెసర్/ అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 58 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ 50 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 25-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..