- Telugu News Photo Gallery Cricket photos IPL 2022 chennai super kings lowest score in ipl history vs mumbai indians csk vs mi
IPL 2022: ముంబై దెబ్బకు ఆ చెత్త రికార్డులో చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో రెండోసారి..
Chennai Super Kings: ముంబై జట్టు కేవలం 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసి, విజయం సాధించింది. దీంతో చెన్నై టీం ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది.
Updated on: May 13, 2022 | 6:21 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఈ జట్టు IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది. కానీ, ఈ జట్టు ఐపీఎల్ 2022 అంతగా కలిసిరాలేదు. ఈ టీమ్ గడ్డు దశను దాటుతోంది. ప్రస్తుత సీజన్‌లో ప్లేఆఫ్‌ల రేసులో ఉండేందుకు, ఈ జట్టు గురువారం వాంఖడే స్టేడియంలో ముంబైతో తలపడింది. అయితే ఏ జట్టు చేయకూడని పని చెన్నై సొంతమైంది.

టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదటి బంతికే చెన్నైని ఇబ్బంది పెట్టాడు. చెన్నైని 100 పరుగులు చేసేందుకు కూడా ముంబై అనుమతించలేదు. చెన్నై జట్టు 16 ఓవర్లలో కేవలం 97 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌లో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోరు.

IPLలో చెన్నై అత్యల్ప స్కోరు 79 పరుగులుగా నిలిచింది. ఇది కూడా ముంబైపై చెన్నై చేసినదే కావడం విశేషం. మే 5, 2013న వాంఖడే స్టేడియంలో ముంబై 80 పరుగుల ముందు చెన్నైని ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 139 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPLలో చెన్నై మూడవ అత్యల్ప స్కోరు 109 పరుగులుగా నిలిచింది. 4 మే 2008న రాజస్థాన్ రాయల్స్‌పై చేసింది. ముంబై 2019 ఏప్రిల్ 26న చెన్నైని 109 పరుగులకు ఆలౌట్ చేసింది.

గురువారం చెన్నై తరుపున మహేంద్ర సింగ్ ధోనీ జట్టును కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా మరో ఎండ్ నుంచి అతనికి మద్దతు లభించలేదు. చెన్నై తరపున ధోనీ అత్యధికంగా అజేయంగా 36 పరుగులు చేశాడు. కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోరును నమోదు చేయగలిగారు. డ్వేన్ బ్రావో 12 పరుగులు చేశాడు. శివమ్ దూబే, అంబటి రాయుడు చెరో 10 పరుగులు చేశారు. అనంతరం ఛేజింగ్ చేసిన ముంబై జట్టు కేవలం 14.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. దీంతో చెన్నై టీం కూడా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది.




