Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మొదలైన 200 మీ. రన్నింగ్ రేస్.. కట్ చేస్తే.. జారిపోయిన చిన్నారి షూ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

నెట్టింట్లో ఎన్నో వీడియోలు వచ్చి చేరుతుంటాయి. అయితే, కొన్ని వీడియోలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని మనకు ఆనందాన్ని కలిగిస్తాయి.

Viral Video: మొదలైన 200 మీ. రన్నింగ్ రేస్.. కట్ చేస్తే.. జారిపోయిన చిన్నారి షూ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Girl Running Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: May 11, 2022 | 3:59 PM

నెట్టింట్లో ఎన్నో వీడియోలు వచ్చి చేరుతుంటాయి. అయితే, కొన్ని వీడియోలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఎంతో ఆదర్శంగా నిలిచిపోతాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ బాలిక(Girl viral video) వీడియో నెట్టింట్లో తెగ సందడి(Viral Video) చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఎంతో ఆశ్చర్యంతోపాటు, ఆమె స్ఫూర్తికి సలాం చేస్తారు. బాక్సింగ్ కింగ్ మీడియా అనే యూట్యూబ్(Youtube) ఛానెల్‌లో పంచుకున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 27వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 352 మందికి పైగా లైక్ చేయగా ఎంతో 100కు పైగా కామెంట్స్ చేశారు. ఓ పాఠశాలలో బాలికల పరుగు పందెంకు అంతా రెడీ చేశారు. చిన్నారులంతా ట్రాక్‌లో నిల్చున్నారు. 1, 2, 3 అనగానే చిన్నారులంతా రన్నింగ్ మొదలుపెట్టారు. అయితే, అందులో ఓ చిన్నారి మాత్రం పరుగు స్టార్ట్ చేసేముందు తన షూ జారిపోయింది.

Also Read: 180 సిక్సర్లు.. 3005 పరుగులు.. బౌలర్లను దంచేసిన బ్యాటర్.. కట్ చేస్తే.. ఆ జట్టు నుంచి తప్పించారు..

అయితే, ఆ పాప మాత్రం అధైర్యపడుకుండా, నిరుత్సాహం చెందకుండా.. వెంటనే వచ్చి తన షూని కట్టుకుంది. ఆ వెంటనే పరుగు మొదలుపెట్టింది. అందరి కంటే వెనకాల ఉన్నా.. తన బలమైన సంకల్పంతో మరలా ట్రాక్‌లో ఉన్న మిగతావారితో సమానంగా చేరుకుంది. అదే క్రమంలో మిగిలిన చిన్నారులను ఓడించి, విజేతగా నిలిచింది. మొత్తంగా 200 మీటర్ల రేసులో గెలుపు సాధించి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన జనాలు.. చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. నెటిజన్లు కూడా చిన్నారి టాలెంట్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ రన్నింగ్ గర్ల్ పేరు లే లే. ఈ చిన్నారి తండ్రి టెరెన్స్ క్రాఫోర్డ్ ప్రొఫెషనల్ బాక్సర్. టెరెన్స్ 2018లో WBO వెల్టర్‌వెయిట్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. కాగా, ఈ చిన్నారి వీడియో నెట్టింట్లో ప్రస్తుతం తెగ సందడి చేస్తోంది. మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Snakes Found: ఇంట్లో చాలాకాలంగా మట్టి కుండలు.. తెరిచి చూసిన యాజమాని షాక్..

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్లలో నడుస్తోన్న నయా ట్రెండ్.. సూపర్ హిట్ సాంగ్‌‌తో పెళ్లి పందిరిలోకి వధువు గ్రాండ్ ఎంట్రీ..