JEE Main 2022 Results: జేఈఈ మెయిన్స్ సెషన్- 1 ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల
జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1కు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం (జులై 2) విడుదల చేసింది. సమాధాన పత్రంలో ఏవైనా అభ్యంతరాలుంటే అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో ఆన్‌లైన్ విధానంలో..
Last Day To Raise Objections On JEE Main 2022 Answer Key: జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1కు సంబంధించి ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం (జులై 2) విడుదల చేసింది. సమాధాన పత్రంలో ఏవైనా అభ్యంతరాలుంటే అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో ఆన్‌లైన్ విధానంలో లేవనెత్తవచ్చు. జులై 4వ తేదీ సాయంత్రం 5 గంటలోపు ఆన్‌లైన్ విధానంలో ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయడానికి గడువును ఇస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఐతే అభ్యంతరాలపై ప్రతి ప్రశ్నకు రూ.200లు చెల్లించవల్సి ఉంటుంది. గడువు సమయంలోపు వచ్చిన అభ్యంతరాలు అన్నింటినీ సబ్జెక్ట్ నిపుణులు పరిశీలించిన అనంతరం ఫైనల్ కీ విడుదలౌతుంది. ఆ తర్వాత తుది ఫలితాలు ప్రకటిస్తామని ఎన్టీఏ తెల్పింది.
JEE Main 2022 Answer Keyపై అభ్యంతరాలను ఈ కింది విధంగా తెలియజేయవచ్చు..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజీలో కనిపించే “Click here for QP / Responses and Provisional Answer Keys of JEE(Main) 2022
- Session 1 for Challenge” లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీలతో లాగిన్ అవ్వాలి.
- వెంటనే జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అభ్యంతరం సవాలు చేయాలనుకుంటున్న ప్రశ్న సంఖ్యను ఎంపిక చేసుకోవాలి.
- సరైన సమాధానం తెలిపే ఇతర డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చు లేదా అల్టర్‌నెట్ ఆన్సర్‌ను సూచించవచ్చు.
- ఫీజు చెల్లించిన తర్వాత OKపై క్లిక్ చెసి, ప్రింట్‌ఔట్ తీసుకోవాలి.
జేఈఈ మెయిన్ 2022కు సంబంధించి ఇతర సందేహాల నివృతికి 011-40759000 లేదా jeemain@nta.ac.inకి ఈమెయిల్ పంపవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.