Watch Video: ఉత్కంఠగా మ్యాచ్.. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. ఆటగాళ్ల పరిస్థితి ఏంటో తెలుసా?

ఇంగ్లండ్‌లో జరుగుతున్న క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో ఓ చిన్నారి స్కూటర్‌తో పిచ్‌పైకి రావడంతో ఆటగాళ్లంతా షాకయ్యారు. ఆ చిన్నారిని ఎవరూ ఆపకపోవడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch Video: ఉత్కంఠగా మ్యాచ్.. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. ఆటగాళ్ల పరిస్థితి ఏంటో తెలుసా?
Cricket Viral Video
Follow us

|

Updated on: May 10, 2022 | 5:16 PM

తరచుగా అభిమానులు క్రికెట్(Cricket) మైదానంలోకి ప్రవేశిస్తుంటారనే విషయం తెలిసిందే. అప్పటిదాకా ఎంతో ఉత్కంఠగా సాగే మ్యాచ్‌లో వీరి ఎంట్రీతో కాస్తా సరదాగా మారినా.. కొన్నిసార్లు ఎంతో భయాన్ని కూడా కలిగిస్తుంటాయి. ఈ కారణంగా ఆటను కూడా నిలిపేయాల్సి ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఆన్నాయి. తాజాగా, ఇంగ్లండ్‌(England)లో జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనే ఎదురైంది. అక్కడ క్లబ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఆ చిన్నారి మైదానంలోనే కాకుండా పిచ్‌ వద్దకు చేరుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ చిన్నారి స్కూటర్‌తో పిచ్‌పైకి చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. పిచ్‌లో ఆటగాళ్లు నిలబడి ఉన్నారు. అప్పుడే ఓ చిన్నారి తన స్కూటర్‌ను నడుపుతూ పిచ్‌పైకి చేరుకోవడం వీడియోలో కనిపిస్తోంది.

చిన్నారిని చూసి అంతా షాకయ్యారు. ఎవరూ అడ్డు చెప్పలేదు. ఇదంతా చూసి అంపైర్లు కూడా ఆశ్చర్యపోయారు. అంతెందుకు, సెక్యూరిటీని ఛేదించి పిల్లాడు పిచ్‌లోకి ఎలా చేరుకున్నాడు? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. పిల్లల ఆటలా సాగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. చివరికి చిన్నారిని ఎవరూ ఏమి అనకముందే స్కూటర్ తిప్పి వెనక్కి వెళ్ళిపోవడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

రంజీ మ్యాచ్‌లోనూ కారుతో గ్రౌండ్‌లోకి ఎంట్రీ..

ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. రంజీ ట్రోఫీ సమయంలో ఒక వ్యక్తి జీప్‌తో మైదానంలోకి ప్రవేశించాడు. గౌతమ్ గంభీర్, ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్‌లో ఆడడం విశేషం. ఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. సాయంత్రం ఆట జరుగుతుండగా ఒక కారు పిచ్‌ మధ్యలోకి చేరుకుంది. ఈ ఘటన తర్వాత ఈ మైదానంలోని ప్రధాన గేట్ల వద్ద ఎలాంటి భద్రత లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఆ తర్వాత కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

ఇంగ్లండ్ వర్సెస్ భారత్ మ్యాచ్‌లోనూ..

టీమిండియా ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా, డేనియల్ జార్విస్ అకా జార్వూ మైదానంలోకి చొరబడిన తర్వాత బాగా ప్రాచుర్యం పొందాడని తెలిసిందే. లార్డ్స్ టెస్టు సందర్భంగా జార్వూ మైదానంలోకి దిగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. దీని తర్వాత ఓవల్ టెస్టు సందర్భంగా కూడా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇది మాత్రమే కాదు, జానీ బెయిర్‌స్టోను జార్వో ఢీకొన్నాడు. ఈ ఘటనలో బెయిర్‌స్టో గాయపడవచ్చు. ఈ ఘటన తర్వాత జార్వో ఓవల్‌లోకి ప్రవేశించడంపై జీవితకాల నిషేధం విధించారు. ఇంగ్లండ్‌లోని పిచ్‌లోకి చొరబడే వారిపై నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.

Also Read: Viral Video: నువ్వు అలా చేస్తే.. నేను ఇలా చేస్తా బాస్.. వేదికపైనే వరుడికి షాకిచ్చిన వధువు..

Viral Video: రెప్పపాటులో పెంపుడు కుక్క ప్రాణాలను కాపాడిన సూపర్ ఉమెన్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..