PF Account: మీ పీఎఫ్ ఖాతాల్లో బ్యాలెన్స్ తెలుసుకోవాలా..? ఈ టిప్స్‌తో క్షణాల్లో బ్యాలెన్స్ వివరాలు
భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆయా యాజమాన్యాల సహకారంతో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి వైపు ఉద్యోగులకు ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగి బేసిక్ జీతంలో నుంచి 12 శాతం, అదే మొత్తంలో యజమాని సహకారంతో కలిపి ప్రతి నెలా ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తూ ఉంటారు.

భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆయా యాజమాన్యాల సహకారంతో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి వైపు ఉద్యోగులకు ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగి బేసిక్ జీతంలో నుంచి 12 శాతం, అదే మొత్తంలో యజమాని సహకారంతో కలిపి ప్రతి నెలా ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ఈపీఎఫ్ సేవలను ఖాతాదారులు సులభంగా యాక్సెస్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా అనుకోని ఆర్థిక అవసరాలకు కొంత పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేయాలనుకునే వారికి పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేయడం పెద్ద ప్రహసనంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సింపుల్ స్టెప్స్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలో? ఓసారి తెలుసకుందాం.
ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తనిఖీ ఇలా
‘EPFOHO’ అని టైప్ చేసి మీ UAN నంబర్, మీరు ఇష్టపడే భాషలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయాలి.
అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899కి పంపితే మీ బ్యాలెన్స్ వివరాలు మీకు మెసేజ్ ద్వారా వస్తాయి.
మిస్డ్ కాల్ ద్వారా
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు డయల్ చేస్తే కొద్ది క్షణాల్లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ మెసేజ్ ద్వారా మీకు వస్తుంది.
ఈపీఎఫ్ పాస్ బుక్ తనిఖీ ఇలా
- ముందుగా యూఏఎన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఆరు గంటల తర్వాత మీ పాస్‌బుక్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా డేటాలో ఏమైనా మార్పులు చేయాలనుకున్నా యూఏఎన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు.
- ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి.. సర్వీసెస్‌లో మెంబర్ పాస్ బుక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం పీఎఫ్ పాస్ బుక్ సైట్‌కు మీరు రీడైరెక్ట్ అవుతారు
- అక్కడ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. అనందరం క్యాప్చాను పూర్తి చేసి ‘సైన్ ఇన్’ క్లిక్ చేయాలి.
- తర్వాత మీ ఆధార్-లింక్ చేయబడిన ఫోన్ నంబర్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ నమోదు చేశాక మీ పాస్ బుక్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ఏయే నెలలో ఎంత జమైందో? ఈజీగా తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి