Gold Price Today: బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..

అందుకే బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల ధర రూ. 65 వేలకు చేరొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆదివారం దేశంలోని...

Gold Price Today: బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
Gold And Silver Price
Follow us

|

Updated on: Jul 28, 2024 | 6:31 AM

బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి వస్తువుగా కూడా భావించేవారు మనలో చాలా మందే ఉంటారు. మరీ ముఖ్యంగా భారతీయులను, బంగారాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితి. అందుకే బంగారానికి సంబంధించిన వార్తలను ఆసక్తిగా చూస్తుంటారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుంచి తులం బంగారం ధర ఏకంగా రూ. 10 వేల వరకు తగ్గడం విశేషం.

అందుకే బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల ధర రూ. 65 వేలకు చేరొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆదివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశరాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,150 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,000గా నమోదైంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,530 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,250కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 69,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,000 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,000గా నమోదైంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆదివారం వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 84,500కి చేరింది. అలాగే చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 89,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే..
రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!