ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయని వారికి గుడ్ న్యూస్.. మరో నెలపాటు గడువు పెంపు..?
భారతదేశంలో ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. గడవు ముంచుకొస్తున్నా చాలా మంది ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదని నివేదికలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైల్ చేసే గడువు పెంచే అవకాశం ఉంటుందని పలువురు బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు జూలై 31 2024లోపు ఐటీఆర్‌ను దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత సంవత్సరం జూలై 31, 2023 నాటికి సుమారు 6.77 కోట్ల ఐటీ రిటర్న్‌లు సమర్పించారు.
భారతదేశంలో ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. గడవు ముంచుకొస్తున్నా చాలా మంది ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదని నివేదికలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైల్ చేసే గడువు పెంచే అవకాశం ఉంటుందని పలువురు బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు జూలై 31 2024లోపు ఐటీఆర్‌ను దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత సంవత్సరం జూలై 31, 2023 నాటికి సుమారు 6.77 కోట్ల ఐటీ రిటర్న్‌లు సమర్పించారు. అయితే ఈ ఏడాది ఈ రికార్డు దాటుతుందని అంచనా వేసినా ఆ స్థాయిలో ఐటీఆర్ ఫైల్ కాలేదని నిపుణులు చెబుతున్నారు. అందువల్లే ఆగస్టు 31 వరకు గడువు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు గురించి నిపుణుల అంచనాలను ఓ సారి తెలుసుకుందాం.
జూలై 26, 2024 నాటికి ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం దాదాపు 4.6 కోట్ల మాత్రమే ఐటీఆర్‌లు ఫైల్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం గత ఏడాది జూలై 31 వరకు 6.77 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ చేశారు. దీన్ని బట్టి పన్ను చెల్లింపుదారులు ఈ సంవత్సరం తమ ఫైలింగ్‌లను ఇంకా పూర్తి చేయలేదని అర్థం అవుతుంది. గత సంవత్సరం గమనించిన ట్రెండ్, ప్రస్తుత వేగాన్ని బట్టి, మిగిలిన పన్ను చెల్లింపుదారులకు మేలు కల్పించేలా గడువు పెంచే అవకాశం ఉందని వివరిస్తున్నాు. ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటివరకు 4,60,15,630 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు చేయగా, వీటిలో 4.23 ఐటీఆర్‌లు ధ్రవీకరించారు. అలాగే 1.9 కోట్ల ధ్రువీకరించిన ఐటీఆర్‌లకు రీఫండ్ ప్రాసెస్‌లో ఉంది. ఈ ఏడాది ఆదాయపు పన్ను నిపుణులు ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు బాగా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అందువల్లే పన్ను చెల్లింపుదారులు తమ ఫైలింగ్‌లను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని వివరిస్తున్నారు.
ఆదాయపు పన్ను బార్ అసోసియేషన్ (ఐటీబీఏ) ఇప్పటికే ఆదాయపు పన్ను దాఖలు గడువును పొడిగించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. ఈ మేరకు అధికారులకు ఓ లేఖ రాశారు. దాదాపు నెల రోజులుగా ఆదాయపు పన్ను పోర్టల్ సరిగ్గా పనిచేయడం లేదని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా అప్‌లోడ్ సంబంధిత సమస్యలు, ఆధార్ ఓటీపీ ధ్రువీకరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరిస్తున్నారు. అందువల్ల ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను అప్‌డేట్ చేయడమే కాకుండా 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరం గడువు తేదీని జూలై 31, 2024 నుంచి ఆగస్టు 31, 2024 వరకు పొడిగించాలని కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..