AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan App Scam: వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ ప్రజలకు అనేక రకాల సవాళ్లను ముందు ఉంచుతుంది. పెరిగిన స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ ప్రాముఖ్యత వల్ల ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టెక్నాలజీను వినియోగించుకుని కేటుగాళ్లు కొత్త రకాల మోసాలకు తెరతీస్తున్నారు.

Loan App Scam: వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
Scam
Nikhil
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 27, 2024 | 5:10 PM

Share

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ ప్రజలకు అనేక రకాల సవాళ్లను ముందు ఉంచుతుంది. పెరిగిన స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ ప్రాముఖ్యత వల్ల ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టెక్నాలజీను వినియోగించుకుని కేటుగాళ్లు కొత్త రకాల మోసాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంత విలయం సృష్టించిందో? అందరికీ తెలుసు. లాక్ డౌన్ వల్ల చాలా మంది పనుల్లేక, డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో చాలా మంది తమ అవసరాలకు ఆ లోన్స్ తీసుకున్నారు. అయితే మొదట తక్కువ వడ్డీ అని చెప్పినా వివిధ రకాల చార్జీల పేరుతో లోన్ తీసుకున్న వారిని ఆ యాప్ నిర్వాహకులు వేధించేవారు. కరోనా సమయంలో అందుబాటులోకి ఈ లోన్ యాప్స్ వల్ల చాలా మంది రుణం చెల్లించలేక, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రుణం ఇవ్వకుండానే వేధించే స్థాయికు లోన్ యాప్స్ చేరాయి. ప్రస్తుతం 25 ఏళ్ల యువతి ఈ లోన్ యాప్ ద్వారా ఇబ్బందిపడుతున్నట్లు పోలీసులను ఆశ్రయించడంతో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది.

ఇటీవల ఇన్‌స్టంట్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుందామనుకున్న 25 ఏళ్ల యువతికి లోన్ నిరాకరించడమే ఆ లోన్ యాప్ బాధితులు ఆమెను తీవ్రంగా వేధించారు. ముఖ్యంగా యాప్ డౌన్ లోడ్ చేశాక ఇచ్చాక పర్మిషన్లతో ఆమె ఫొటోలను మార్ఫ్ చేసి ఆమెను ఇబ్బందిపెట్టారు. ముఖ్యంగా ఫొటోలను అశ్లీలంగా ఎడిట్ చేసి ఆ ఫొటోలను ఆమె ఫోన్ కాంటాక్ట్‌లోని కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్‌కు కూడా పంపుతామని బెదిరించారు. బైకుల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదు చేసిన యువతి బైకుల్లాలోని ఘోడప్‌దేవ్‌ నివాసి. ఏప్రిల్‌లో ఇంటర్నెట్‌లో చూసి ఆమె తన ఫోన్‌లో లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంది. అనంతరం ఆమె తన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, బంధువుల ఆప్షనల్ నంబర్లను అందించింది. తర్వాత ఫిర్యాదుదారుడికి రుణం రాకపోవడంతో ఆమె తన ఫోన్‌లోని యాప్‌ను తొలగించింది.

అయితే ఇటీవల ఆమెకు అన్‌నోన్ మొబైల్ నంబర్ నుంచి రుణం చెల్లించాలని, లేకపోతే ఆమె ఫోటోగ్రాఫ్‌లను కుటుంబ సభ్యులకు పంపుతామని వాట్సాప్ ద్వారా మెసేస్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆమె మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫోటోలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆ లోన్ యాప్ తరఫున కాల్ చేసిన వ్యక్తి  దుర్భాషలాడుతూ, అవమానకరంగా మాట్లాడాడు. ఈ ఘటనపై ఆమె కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారం అందించడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!