LIC Kanyadan: ఆడబిడ్డల కోసం అద్భుతమైన స్కీమ్.. పెళ్లి నాటికి చేతిలో రూ. 22.5లక్షలు..
ఆడపిల్లల విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించాలి. వారి చదువు, పెళ్లి తదితర విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆడపిల్లకు పెళ్లి చేయడం ఈ రోజుల్లో మామూలు విషయంలో కాదు. దానికోసం చిన్నప్పటి నుంచే సరైన ప్రణాళితో వెళ్లాలి. ఇందుకోసం అనేక పథకాలు అమలులో ఉన్నాయి. వాటిలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ ఐసీ) అందజేస్తున్న కన్యాదాన్ పాలసీ ఒకటి.
పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారి తల్లిదండ్రులు సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఆదాయాన్ని పొదుపు చేసుకుని, దానిని పెట్టుబడిగా పెట్టడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో లాభాలు కలుగుతాయి. పిల్లల చదువు కోసం, అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించాలి. వారి చదువు, పెళ్లి తదితర విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆడపిల్లకు పెళ్లి చేయడం ఈ రోజుల్లో మామూలు విషయంలో కాదు. దానికోసం చిన్నప్పటి నుంచే సరైన ప్రణాళితో వెళ్లాలి. ఇందుకోసం అనేక పథకాలు అమలులో ఉన్నాయి. వాటిలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ ఐసీ) అందజేస్తున్న కన్యాదాన్ పాలసీ ఒకటి.
ఎల్ఐసీ కన్యాదాన్..
ఎల్ఐసీ కన్యాదాస్ పాలసీతో ఆడపిల్లల భవిష్యత్తు పూర్తి భద్రత లభిస్తుంది. నెలకు రూ.3,447 ప్రీమియం చెల్లిస్తూ మెచ్యురిటీ తర్వాత రూ. 22.50 లక్షలు పొందవచ్చు. దీనివల్ల ఆదాయపు పన్ను ప్రయోజనాలు, రుణ సౌకర్యం, బీమా ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ పాలసీని తీసుకోవాలంటే ఆడపిల్ల వయసు ఏడాది నుంచి రూ.పదేళ్ల లోపు ఉండాలి. అలాగే పాప తండ్రి వయసు 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలి.
పాలసీ కాలవ్యవధి..
కన్యాదాన్ పాలసీ వ్యవధి 13 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. బీమా ప్రీమియాన్ని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, సంవత్సరం ప్రాతిపదికన కట్టవచ్చు. సుమారు 25 ఏళ్ల టర్మ్ ప్లాన్‌ని ఎంచుకుంటే 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. పాలసీ మాత్రం 25 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. పాలసీని కొనుగోలు చేసిన తర్వాత మూడో సంవత్సరం నుంచి రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల పూర్తయిన తర్వాత పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. ప్రీమియం చెల్లించడానికి గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గడువు పూర్తయిన 30 రోజుల గ్రేస్ పీరియడ్‌లో ప్రీమియం చెల్లించవచ్చు.
పన్ను మినహాయింపు..
పాలసీని తీసుకోవడం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. అవి రెండు విధాలుగా ఉంటాయి. ప్రీమియం చెల్లించిన తర్వాత దానికి 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. అలాగే మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా సెక్షన్ 10డీ కింద పన్ను రహితంగా పరిగణిస్తారు. పాలసీకి హామీ మొత్తం పరిమితి కనిష్టంగా రూ. 1 లక్ష నుంచి మొదలవుతుంది. గరిష్ట పరిమితి లేదు.
బీమా కవరేజీ..
కన్యాదాన్ పాలసీని 25 ఏళ్ల కాలవ్యవధికి తీసుకున్నారంటే రూ. 41,367 వార్షిక ప్రీమియం అవుతుంది. దానిని నెలవారీగా రూ.3,447 చొప్పున 22 ఏళ్లు చెల్లించాలి. అయితే మీకు 25 సంవత్సరాల కాల వ్యవధిలో రూ. 22.5 లక్షల జీవిత బీమా కవరేజీని ఉంటుంది. పాలసీ వ్యవధిలో తండ్రి మరణిస్తే, ఆ తర్వాతి కాలానికి అమ్మాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మాఫీ చేయడంతో పాటు 25 ఏళ్ల మెచ్యూరిటీ పూర్తయ్యే వరకూ ఏటా రూ.1 లక్ష అందిస్తారు. 25వ సంవత్సరంలో ఒకేసారి మెచ్యూరిటీ మొత్తం ఇస్తారు. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణిస్తే నామినీకి అన్ని మరణ ప్రయోజనాలతో పాటు రూ.10 లక్షల ప్రమాద బీమా అందజేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..