తండ్రి అవ్వాలనే కోరిక కలగానే మిగిలిందా..? ఈ ఐదు ఫుడ్స్ ట్రై చేయండి..

ఉరుకులు పరుగుల జీవితం, బాధ్యతలు.. ఒత్తిడి ఇవన్నీ ప్రస్తుత కాలంలో కామన్‌గా మారాయి.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నారు.. ముఖ్యంగా పురుషులు మరెన్నో సమస్యల బారిన పడుతుంటారు. ఇది వారి భవిష్యత్తు, ఆరోగ్యం, సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

తండ్రి అవ్వాలనే కోరిక కలగానే మిగిలిందా..? ఈ ఐదు ఫుడ్స్ ట్రై చేయండి..
సమయాన్ని గడపండి -కలిసి ఎంజాయ్ చేయండి.. : సంబంధాన్ని బలోపేతం చేయడానికి, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి.. నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఇది కాకుండా, అబ్బాయిలు.. అమ్మాయిలు ఇద్దరూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, కొన్ని సంవత్సరాల సంబంధం తర్వాత.. అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు ఇచ్చే సమయాన్ని తగ్గించుకుంటారు. కానీ మీరు సంబంధాన్ని బలోపేతం చేయాలనుకుంటే, మీరు ఒకరికొకరు సమయాన్ని వెచ్చించుకోవాలి.. కలిసి గడపడానికి ప్లాన్ చేసుకోవాలి.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 27, 2024 | 4:40 PM

ఉరుకులు పరుగుల జీవితం, బాధ్యతలు.. ఒత్తిడి ఇవన్నీ ప్రస్తుత కాలంలో కామన్‌గా మారాయి.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నారు.. ముఖ్యంగా పురుషులను ఇంకా మరెన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇది వారి భవిష్యత్తు, ఆరోగ్యం, సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మగ వంధ్యత్వం సమస్యతో బాధపడుతున్నారని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వంధ్యత్వం అనేది మహిళల్లోనే కాదు పురుషులలో కూడా చాలామందిలో కనిపిస్తుంది.. మగ వంధ్యత్వం అనేది ఒక ప్రబలమైన సమస్య.. భౌగోళిక స్థానం, వయస్సు సమూహం, అంతర్లీన కారణాలు వంటి అంశాల ఆధారంగా దాని ప్రాబల్యం మారవచ్చు.. వివిధ అధ్యయనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 7-10% మంది పురుషులు వంధ్యత్వాన్ని అనుభవిస్తున్నారు. మగ వంధ్యత్వం అనేది స్పెర్మ్ (వీర్యం) ఉత్పత్తి, నాణ్యత లేదా డెలివరీని ప్రభావితం చేసే కారకాల కారణంగా గర్భధారణను సాధించలేకపోవడాన్ని సూచిస్తుంది. దీనివల్ల సంతానం అనేది కలగానే మిగులుతుంది.. పురుషుల వంధ్యత్వం సాధారణంగా వీర్యం పరిమాణం తగ్గడం వల్ల వస్తుంది. పురుషుల్లో కూడా సంతానోత్పత్తిపై ఆందోళన పెరుగుతోంది. పేలవమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా స్పెర్మ్ కౌంట్, నాణ్యత దెబ్బతింటున్నాయని.. దీనివల్ల వారి సంతాన కోరిక కలగానే మిగులుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. కొన్ని ప్రత్యేకమైన ఆహారాల సహాయంతో, మీరు మీ సంతానోత్పత్తిని పెంచుకోవచ్చు. ఆ ఐదు ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సీఫుడ్: సీఫుడ్‌లో స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమైన జింక్ పుష్కలంగా ఉంటుంది. వీర్యకణాల నాణ్యతను మెరుగుపరిచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి.

వాల్నట్: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీఆక్సిడెంట్లు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచడంలో సహాయపడతాయి.

టొమాటో: టొమాటోల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బ్రోకలీ: బ్రోకలీలో విటమిన్ సి ఉంటుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

గ్రీక్ యోగర్ట్ (పెరుగు): పెరుగులో ప్రోటీన్, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్పెర్మ్ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి..

ఈ ఆహార పదార్థాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం.

ధూమపానం, మద్యపానం, ఒత్తిడికి దూరంగా ఉండండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

ఒక్కోసారి పురుషులతోపాటు స్త్రీలలో కూడా సమస్యలు ఉంటాయి.. కావున ఏళ్ల పాటు సంతానలేమి సమస్యతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..