Constipation: వర్షా కాలంలో మలబద్ధక సమస్యా.. ఈ బెస్ట్ చిట్కాలు ట్రై చేయండి..

వర్షా కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. వర్షాకాలం కారణంగా సూర్య రశ్మి అంతగా రాదు. ఈక్రమంలో తిన్న ఆహారం సరిగా అరగదు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు, మలబద్ధకం ఏర్పడుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరంగా, నొప్పిగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉంటే లైఫ్ స్టైల్‌పై కూడా ఇబ్బంది పడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. చాలా మంది ఇదే సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. మల బద్ధకం సమస్య గురించి..

Constipation: వర్షా కాలంలో మలబద్ధక సమస్యా.. ఈ బెస్ట్ చిట్కాలు ట్రై చేయండి..
Constipation
Follow us

|

Updated on: Jul 28, 2024 | 1:23 PM

వర్షా కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. వర్షాకాలం కారణంగా సూర్య రశ్మి అంతగా రాదు. ఈక్రమంలో తిన్న ఆహారం సరిగా అరగదు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు, మలబద్ధకం ఏర్పడుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరంగా, నొప్పిగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉంటే లైఫ్ స్టైల్‌పై కూడా ఇబ్బంది పడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. చాలా మంది ఇదే సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. మల బద్ధకం సమస్య గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టేందుకు కొన్ని సహజమైన పద్దతులు పాటిస్తే సరిపోతుంది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైబర్ రిచ్ ఫుడ్స్:

మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల త్వరగా ఆహారం జీర్ణం అవుతుంది. దీంతో వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఫ్రూట్స్, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకుంటూ ఉండండి.

వేడి నీళ్లు తాగాలి:

వర్షా కాలంలో మల బద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు ఎక్కువగా వేడి నీళ్లు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆహారం అనేది త్వరగా జీర్ణం అవుతుంది. దీని వల్ల మల బద్ధకం సమస్య తగ్గుతుంది. అదే విధంగా ఈ సీజన్‌లో చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటారు. నీటిని తక్కువగా తీసుకున్నా కూడా తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కాబట్టి నీటికి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఉదయం బ్రష్ చేసిన తర్వాత నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల స్టూల్ మూమెంట్ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

నెయ్యి:

మల బద్ధకం సమస్యను తగ్గించడంలో నెయ్యి ఎంతో చక్కగా పని చేస్తుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ప్రేగుల్లో మెటబాలిజం ఎక్కువగా వృద్ధి చెందుతుంది. దీని వల్ల స్టూల్ మూమెంట్ అనేది పెరుగుతుంది. రాత్రి పూట తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అవిశె గింజలు:

మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతి రోజూ అవిశె గింజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు అవిశె గింజలు తీసుకుంటే.. స్టూల్ మూమెంట్ బాగా పెరుగుతుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..