Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: సొంతింటి కల..నెరవేర్చుకోండిలా.. హోమ్‌లోన్ తీసుకునే సమయంలో ఆ జాగ్రత్తలతో బోలెడు లాభాలు

సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన చిరకాల కోరిక. ఈ కలను నెరవేర్చుకోవడానికి జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపుతో పాటు ఇంటి రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చకుంటారు. అయితే ఇల్లు కొనడం ఎంత ముఖ్యమో? రుణం తీసుకున్న సమయంలో తక్కువ వడ్డీతో రుణం పొందడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Home Loan: సొంతింటి కల..నెరవేర్చుకోండిలా.. హోమ్‌లోన్ తీసుకునే సమయంలో ఆ జాగ్రత్తలతో బోలెడు లాభాలు
Home Loan
Follow us
Srinu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 27, 2024 | 6:00 PM

సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన చిరకాల కోరిక. ఈ కలను నెరవేర్చుకోవడానికి జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపుతో పాటు ఇంటి రుణం తీసుకుని సొంతింటి కలను నెరవేర్చకుంటారు. అయితే ఇల్లు కొనడం ఎంత ముఖ్యమో? రుణం తీసుకున్న సమయంలో తక్కువ వడ్డీతో రుణం పొందడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. హోమ్ లోన్ రీపేమెంట్ విషయంలో వడ్డీ రేట్లు అనేవి కీలకపాత్ర పోషిస్తాయి. వడ్డీ రేట్ల వల్లే మన ఇంటి బడ్జెట్ తారుమారయ్యే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాన్ని పొందాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాన్ని ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.

వడ్డీ రేట్లు 

తక్కువ వడ్డీతో గృహ రుణం పొందాలంటే కచ్చితంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే వడ్డీ రేట్లను సరిపోల్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నెలవారీ ఈఎంఐతో పాటు రుణానికి సంబంధించిన చార్జీలను బేరీజు వేయాలని వివరిస్తున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారానే వడ్డీ రేట్లను తెలుసుకునే అవకాశం ఉంది. సాధారణంగా చిన్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ రేట్లను అందిస్తాయి.

ప్రత్యేక పథకాలు

చాలా మంది రుణదాతలు మహిళా రుణగ్రహీతలు, ప్రభుత్వ ఉద్యోగులు, మొదటిసారి గృహ కొనుగోలుదారుల కోసం తక్కువ వడ్డీ రేట్లతో ప్రత్యేక పథకాలను అందిస్తారు. ఈ పథకాలు మీ రుణ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఉదాహరణకు కొన్ని బ్యాంకులు మహిళా దరఖాస్తుదారులు, రక్షణ సిబ్బందికి రాయితీ ధరలను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

అధిక క్రెడిట్ స్కోర్ 

మీ హెూమ్ లోన్ వడ్డీ రేటును నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. 750 కంటే ఎక్కువ స్కోర్ మంచిగా పరిగణిస్తారు. అందువల్ల తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశాలను పెంచుతుంది. లోపాల కోసం మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.  మీ స్కోర్‌ను మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న అప్పులను చెల్లించాలి

ఈఎంఐలు

ఎక్కువ కాలం ఈఎంఐ చెల్లించేలా లోన్ తీసుకుంటే వడ్డీ అధికమయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ కాలంలో ఈఎంఐలు మొదట్లో బాగానే ఉన్నా లోన్ రీపేమెంట్ సమయంలో చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. తక్కువ రుణ వ్యవధితో లోన్ తీసుకుంటే వడ్డీ ఖర్చులను ఆదా చేయవచ్చు.

ఫ్లోటింగ్ రేట్ లోన్లు

స్థిర-రేటు రుణాల కంటే ఫ్లోటింగ్ రేట్ రుణాలు సాధారణంగా చౌకగా ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు తగ్గుతాయని భావించినప్పుడు. మీరు రేట్లు తగ్గుతుందని ఊహిస్తే ఫ్లోటింగ్ రేట్ లోన్ మరింత తక్కువ ఖర్చుతో పొందవచ్చు. 

ప్రీ అప్రూవ్‌డ్ లోన్స్

ప్రీ అప్రూవ్‌డ్ లోన్స్ త్వరిత ఆమోద ప్రక్రియ, తరచుగా మెరుగైన నిబంధనలతో వస్తాయి. మీ బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ లోన్‌ను అందిస్తే అది మీ సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి