Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metro Train: మెట్రో రైళ్లు, స్టేషన్‌లలో రీల్స్‌.. 1600 మందికి జరిమానా.. షాకిచ్చిన అధికారులు

ఈ మధ్య కాలంలో యువతి, యువకులు రీల్స్‌ చేయడం ఎక్కువైపోతోంది. నడి రోడ్లపైనా, జనాలు తిరిగే ప్రాంతాల్లో, బస్సులు, రైళ్లల్లో ఇలా చాలా రకరకాల పబ్లిక్‌ ప్రాంతాల్లో రీల్స్‌ చేయడం, ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం పెరిగిపోతోంది. ఇలా రీల్స్‌ చేయడం వల్ల ఇతరకు ఇబ్బందిగా మారుతోంది. ఇక ప్రాంగణంలో చట్టాలను ఉల్లంఘించే వారిపై మెట్రో రైల్ కార్పొరేషన్..

Metro Train: మెట్రో రైళ్లు, స్టేషన్‌లలో రీల్స్‌.. 1600 మందికి జరిమానా.. షాకిచ్చిన అధికారులు
Metro Train
Follow us
Subhash Goud

|

Updated on: Jul 26, 2024 | 1:04 PM

ఈ మధ్య కాలంలో యువతి, యువకులు రీల్స్‌ చేయడం ఎక్కువైపోతోంది. నడి రోడ్లపైనా, జనాలు తిరిగే ప్రాంతాల్లో, బస్సులు, రైళ్లల్లో ఇలా చాలా రకరకాల పబ్లిక్‌ ప్రాంతాల్లో రీల్స్‌ చేయడం, ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం పెరిగిపోతోంది. ఇలా రీల్స్‌ చేయడం వల్ల ఇతరకు ఇబ్బందిగా మారుతోంది. ఇక ప్రాంగణంలో చట్టాలను ఉల్లంఘించే వారిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు మెట్రో ప్రాంగణంలో రీలింగ్‌తో సహా ఇబ్బందిని సృష్టించినందుకు 1,600 మందికి పైగా జరిమానా విధించినట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఇది ఏడాది క్రితం ఇదే కాలం కంటే మూడు శాతం ఎక్కువ.

ఇది కూడా చదవండి: Nestle: మ్యాగీ తయారీ కంపెనీ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

డేటా ప్రకారం, మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) చట్టంలోని సెక్షన్ 59 కింద ఇబ్బంది సృష్టించినందుకు 1647 మందిపై ఈ ప్రభావం ఉంది. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1600గా ఉంది. DMRC ఏప్రిల్, మే , జూన్‌లలో వరుసగా 610, 518, 519 మందికి జరిమానా విధించింది. డీఎంఆర్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. మెట్రో ప్రాంతంలో ఇబ్బందులు సృష్టించినందుకు వీరికి జరిమానా విధించినట్లు చెప్పారు. మెట్రో ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మా యంత్రాంగాన్ని ప్రత్యేక నిఘా పెడుతోంది. మెట్రో ప్రాంగణంలో ఎవరైనా ఇలాంటి రీల్స్‌ చేసినా లేదా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేవి ఏవి చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: JioFiber: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌తో జియో ఫైబర్‌

ప్రతి మూలను తనిఖీ చేయడానికి మాకు తగినంత మంది లేకపోవడం సమస్య అని ఆయన అన్నారు. మనకు రోజుకు 67 లక్షల మంది ప్రయాణికులు ఉంటే, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను పర్యవేక్షించడం అంత సులభం కాదు. మా వద్ద CCTV నిఘా ఉంది, దీని ద్వారా ఆవరణలో ఏదైనా సంఘటన జరిగినట్లు మేము తెలుసుకుంటాము. DMRC అనేక మెట్రో స్టేషన్లలో పోస్టర్లను కూడా ఉంచింది, ప్రయాణీకులు తిరగకుండా మరియు ఇతరులకు అసౌకర్యాన్ని సృష్టిస్తుంది. ఏప్రిల్‌లో, రైలులో ఇద్దరు మహిళలు ఒకరికొకరు రంగు చెల్లుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ కావడంతో దర్యాప్తు చేయాల్సిందిగా డిఎంఆర్‌సి ఢిల్లీ పోలీసులను కోరింది.హోలీకిముందు వచ్చిన ఈ వీడియోను చాలా మంది ప్రయాణికులు ఖండించారు. ప్రయాణీకులు అలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు DMRC తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలను తనిఖీ చేసేందుకు మొబైల్ స్క్వాడ్‌లను కూడా ఎప్పటికప్పుడు రంగంలోకి దింపుతున్నామన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి