Indian Railways: 3 రాష్ట్రాలు, 11 స్టాప్‌లు.. రయ్ రయ్‌మంటూ 90 నిమిషాల ప్రయాణం.. ఎలాగంటారా.?

సాధారణ రైళ్లు, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు, గరీభ్‌రధ్ ట్రైన్స్.. ఇలా ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వందేభారత్ రైళ్లు వచ్చేశాయ్. ఇకపై వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ రానున్నాయి. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్‌గా పేరుగాంచిన హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది భారత రైల్వేశాఖ

Indian Railways: 3 రాష్ట్రాలు, 11 స్టాప్‌లు.. రయ్ రయ్‌మంటూ 90 నిమిషాల ప్రయాణం.. ఎలాగంటారా.?
High Speed Train
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 26, 2024 | 1:02 PM

సాధారణ రైళ్లు, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు, గరీభ్‌రధ్ ట్రైన్స్.. ఇలా ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వందేభారత్ రైళ్లు వచ్చేశాయ్. ఇకపై వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ రానున్నాయి. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్‌గా పేరుగాంచిన హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది భారత రైల్వేశాఖ. మొదటి హై-స్పీడ్ రైల్ కారిడార్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రానుండగా.. ఆ తర్వాత చెన్నై-మైసూరు మధ్య రెండో హై-స్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. చెన్నై టూ మైసూరు వయా బెంగళూరు ఈ హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం కేవలం 90 నిమిషాలకు తగ్గనుంది.

ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

11 స్టాప్‌లు. హై-స్పీడ్:

రెండో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాలను కలుపుతూ 463 కిలోమీటర్ల మేరకు విస్తరించనుంది. చెన్నై-మైసూరు మధ్య నడిచే ఈ బుల్లెట్ ట్రైన్‌కు కేవలం 11 స్టాప్‌లు ఉంటాయి. ఈ మార్గంలో చెన్నై, పూనమల్లి, చిత్తూరు, కోలార్, కోడహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి, ఎలక్ట్రానిక్స్ సిటీ, కెంగేరి, మాండ్య, మైసూరు స్టాప్‌లుగా ఉండనున్నాయ్. గంటకు 350 కి.మీ.ల వేగంతో, 320 కి.మీ.ల వేగంతో, సగటున 250 కి.మీ.ల వేగంతో నడిచే ఈ రైళ్ల కోసం హై-స్పీడ్ కనెక్టివిటీ కారిడార్‌ను నిర్మించనుంది రైల్వేశాఖ. భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ కారిడార్ మధ్య శరవేగంగా కొనసాగుతోంది. దీని తర్వాత మైసూరు-బెంగళూరు-చెన్నై కారిడార్ మొదలు కానుందట.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందట

టన్నెల్ వర్క్..

ఈ ప్రాజెక్టు కోసం చెన్నైలో 2.5 కిలోమీటర్లు, చిత్తూరులో 11.8 కిలోమీటర్లు, బెంగళూరు రూరల్‌లో 2 కిలోమీటర్లు, బెంగళూరు నగరంలో 14 కిలోమీటర్ల మేర 30 కిలోమీటర్ల టన్నెల్ నెట్‌వర్క్ ఉంటుంది. ప్రాజెక్ట్ మొదటి దశ చెన్నై నుండి బెంగళూరు వరకు 306 కిలోమీటర్లు, రెండవ దశ బెంగళూరు నుండి మైసూరు వరకు 157 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. మొత్తం ఈ ప్రాజెక్ట్‌లో 313 పట్టణాలు, గ్రామాలు భాగం కానున్నాయి. కాగా, మైసూరు-బెంగళూరు-చెన్నై హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. దక్షిణాది ఆర్ధిక వృద్దిని, వేగవంతమైన ప్రయాణాన్ని, పర్యాటకాన్ని మెరుగుపరుస్తాయని అధికారుల అంచనా.

ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు

Chennai Bangalore

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..