బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఇదే సరైన సమయమని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే... తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం, వెండి, ప్లాటినమ్ కస్టమ్స్ సుంకాల్లో భారీగా కోత విధించి, జీఎస్టీని మాత్రం యధాతథంగా ఉంచారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఇదే అనువైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సోవరిన్ గోల్డ్ బాండ్స్ మరింత లాభాదాయకమని అభిప్రాయపడుతున్నారు. అయితే, భవిష్యత్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతాయని వారు పేర్కొంటున్నారు.