Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioFiber: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌తో జియో ఫైబర్‌

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. రోజురోజుకు తన నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించుకుంటూపోతోంది. ఇటీవల తీసుకువచ్చిన జియో ఫైబర్‌ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌తోపాటు ఉచితంగా ఓటీటీ, 800లకుపైగా ఛానెళ్లను అందిస్తోంది. ఈనేపథ్యంలో జియో ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారులకు శుభవార్త అందించింది..

JioFiber: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. భారీ డిస్కౌంట్‌తో జియో ఫైబర్‌
Jiofiber
Follow us
Subhash Goud

|

Updated on: Jul 26, 2024 | 10:28 AM

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. రోజురోజుకు తన నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించుకుంటూపోతోంది. ఇటీవల తీసుకువచ్చిన జియో ఫైబర్‌ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌తోపాటు ఉచితంగా ఓటీటీ, 800లకుపైగా ఛానెళ్లను అందిస్తోంది. ఈనేపథ్యంలో జియో ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారులకు శుభవార్త అందించింది జియో. 30 శాతం డిస్కౌంట్‌తో ఫ్రీడమ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌, అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ఫైబర్‌.. హోమ్‌ బ్రాండ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసును అందిస్తోంది.

1.2 కోట్లకు పైగా ఇళ్లతో JioFiber/AirFiber 99.99% నాణ్యతతో కూడిన సర్వీస్ అభివృద్ధి చెందుతోంది. భారతీయ గృహాలను డిజిటలైజ్ చేయడం, భారతదేశాన్ని డిజిటల్ సొసైటీగా మార్చడం వంటి ఈ వేగాన్ని మరింత పెంచడానికి, జియో మరింత గృహాలను కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహించే ఒక మంచి ఆఫర్‌ను ప్రకటిస్తోంది. సరసమైన JioAirFiber ప్లాన్‌లపై మరో 30% తగ్గింపు అందిస్తోంది. ఈ ఫ్రీడమ్ ఆఫర్ ద్వారా, కొత్త JioAirFiber వినియోగదారులు రూ. 1,000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీ మినహాయింపు ద్వారా కొత్త కనెక్షన్‌లపై 30% తగ్గింపును పొందుతారు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని జియో చెబుతోంది. ఈ ఆఫర్‌ 26 జూలై నుండి 15 ఆగస్టు వరకు అమలు అవుతుందని జియో తెలిపింది. కొత్త AirFiber కనెక్షన్ల కోసం 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచిస్తోంది.

Freedom Offer

Freedom Offer

3 నెలల ప్లాన్‌:

ఈ ఆఫర్‌ కింద అందించే ప్లాన్‌ ఖరీదు రూ. 2121. ఇందులో ఇన్‌స్టాలేషన్ ఛార్జీ రూ. 1000 ఉంటుంది. మొత్తం ఈ ప్లాన్‌ తీసుకోవాలంటే రూ.3121 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆఫర్‌లో భాగంగా 30 శాతం తగ్గింపుతో ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీ మినహాయించనున్నారు. అన్ని ప్లాన్‌లపై జీరో ఇన్‌స్టాలేషన్ చెల్లుబాటు అవుతుంది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల చెల్లుబాటు ప్లాన్స్‌తో అందిస్తోంది. ఎయిర్‌ఫైబర్‌ 5జీ ప్లస్‌ ఆఫర్‌ కొత్త వినియోగదారులకు చెల్లుబాటు అవుతుంది.

ఎయిర్‌ఫైబర్‌ని ఎలా పొందాలి?

jio.comని సందర్శించాలి. లేదా 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈ ప్లాన్‌ పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!