Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foldable iPhone: ‘పోల్డబుల్‌ ఐఫోన్‌’ వచ్చేస్తోంది.. మార్కెట్లోకి ఎప్పుడో తెలుసా?

దేశంలో, ప్రపంచంలో ఫోల్డబుల్ ఫోన్‌ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. యూజర్లు ఫోల్డబుల్ ఫోన్‌లను కూడా ఇష్టపడుతున్నారు. Samsung, Motorola, Huawei వంటి ఇతర మొబైల్ తయారీ కంపెనీల ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‌లో, ఆపిల్ కూడా ఫోల్డబుల్ ఐఫోన్‌లో పనిచేస్తోందని ఒక నివేదిక వచ్చింది..

Foldable iPhone: 'పోల్డబుల్‌ ఐఫోన్‌' వచ్చేస్తోంది.. మార్కెట్లోకి ఎప్పుడో తెలుసా?
Foldable Iphone
Follow us
Subhash Goud

|

Updated on: Jul 24, 2024 | 12:14 PM

దేశంలో, ప్రపంచంలో ఫోల్డబుల్ ఫోన్‌ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. యూజర్లు ఫోల్డబుల్ ఫోన్‌లను కూడా ఇష్టపడుతున్నారు. Samsung, Motorola, Huawei వంటి ఇతర మొబైల్ తయారీ కంపెనీల ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‌లో, ఆపిల్ కూడా ఫోల్డబుల్ ఐఫోన్‌లో పనిచేస్తోందని ఒక నివేదిక వచ్చింది. అయితే దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఐఫోన్‌ నుంచి ఏదైనా ఫోన్‌ విడదలకు సంబంధించి అప్‌డేట్‌ వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. 2026 ప్రారంభంలో ప్రపంచంలో ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయవచ్చని కంపెనీ అంచనాల ద్వారా తెలుస్తోంది. చాలా కాలంగా ఫోల్డబుల్ ఐఫోన్ తీసుకురావాలని వినియోగదారుల నుండి డిమాండ్ కూడా ఉంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం ధర ఢమాల్.. మరీ ఇంతలానా..?

ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌పై పని చేస్తోంది

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, ఫోల్డబుల్ ఫోన్ పని ఆలోచన దశను దాటి ముందుకు సాగింది. ఇది కాకుండా, ఫోల్డబుల్ ఫోన్‌లలో ఉపయోగించే భాగాల కోసం కంపెనీ ఆసియాలోని సరఫరాదారులను కూడా సంప్రదించింది. ఇది కాకుండా, కంపెనీ ఈ ఉత్పత్తి కోసం V68 అనే ఇంటర్నల్‌ కోడ్‌ను కూడా సృష్టించింది. ఆపిల్ ఎప్పుడు ఫోల్డబుల్ ఫోన్‌ని విడుదల చేసినా శాంసంగ్‌ ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌లతో దానికి ప్రత్యక్ష పోటీ ఉంటుంది. వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడానికి 2019లో ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఫోన్‌ను విడుదల చేసిన మొదటి సంస్థ శాంసంగ్‌. అప్పటి నుండి ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌ల ట్రెండ్ వేగంగా పెరగడం ప్రారంభమైంది.

ఫోల్డబుల్ ఫోన్‌ల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది

జూలై ప్రారంభంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2024లో Samsung Galaxy Z Fold, Z Flip AI ఫీచర్లతో పరిచయం చేసింది. Samsung దీన్ని తేలికగా, సన్నగా ఉండేలా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో చైనా మొబైల్ కంపెనీలు Honor, Huawei కూడా ఈ విభాగంలో ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. గ్లోబల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొదటి త్రైమాసికంలో 49% వృద్ధి చెందింది. ఆరు త్రైమాసికాలలో దాని అత్యధిక వృద్ధి రేటు, హువావే శామ్‌సంగ్‌ను అధిగమించి మొదటి సారి అగ్రస్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం, రాయిటర్స్ దీని గురించి ఆపిల్‌ను అడగగా, ఫోల్డబుల్ ఫోన్‌కు సంబంధించి వారి వైపు నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇది కూడా చదవండి: School Holiday: సంచలన నిర్ణయం.. వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి