Gold Price Today: నిర్మలా సీతారామన్ దెబ్బకు బంగారం ధర ఢమాల్.. మరీ ఇంతలానా..?
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మంగళవారం తన తొలి బడ్జెట్ (బడ్జెట్ 2024)ను సమర్పించిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారాన్ ప్రకటించిన వెంటనే బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మంగళవారం తన తొలి బడ్జెట్ (బడ్జెట్ 2024)ను సమర్పించిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారాన్ ప్రకటించిన వెంటనే బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.4000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Budget 2024: నిర్మలమ్మ పద్దులో తీపి కబురు.. వాహనదారులకు శుభవార్త..అదేంటంటే!
బడ్జెట్‌లో కేంద్రం.. గోల్డ్, సిల్వర్ వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశీయంగా రిటైల్ డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే ధరలు ఒక్కసారిగా పడిపోయాయని చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో ఒక్కరోజులో ఇంత మొత్తం ఎప్పుడూ పడిపోలేదని చెప్పొచ్చు. వేలకు వేలు పతనమైంది. ఇక జూలై 24న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసకుందాం..
- దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,450 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,000 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల70,850 ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850 ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,940 ఉండగా, 70,850 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: Budget 2024: ఐదు కిలోల ఉచిత రేషన్ గడువు పెంపు.. ఎందుకో తెలుసా?
ఇదిలా ఉండగా, వెండి ధర కూడా భారీగా తగ్గింది. నిన్న బడ్జెట్ కారణంగా కిలో వెండి ధరపై ఏకంగా 9వేలకుపైగా తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం వెయ్యి రూపాయలు తగ్గింది. తాజాగా కిలో వెండి ధర రూ.87,900 వద్ద కొనసాగుతోంది.
మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలు
మిస్డ్ కాల్ ద్వారా కూడా బంగారం, వెండి ధరలను తెలుసుకోవచ్చు. ibja కేంద్ర ప్రభుత్వ సెలవులు, శని, ఆదివాల్లో రేట్లను విడుదల చేయదు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర ఎంతో తెలుసుకోవాలంటే 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. మిస్ట్ కాల్ చేసిన కొద్దిసేపటికే రేట్లు SMS ద్వారా అందుతాయి. బంగారం లేదా వెండి ధరను తెలుసుకోవడానికి మీరు www.ibja.co లేదా ibjarates.comని కూడా సందర్శించి ధరలను తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి