BMW Scooter: మార్కెట్‌లోకి సూపర్‌ స్టైలిష్‌ బీఎండబ్ల్యూ స్కూటర్‌ రిలీజ్‌.. ధర ఎంతంటే..?

BMW Premium CE-04: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం దెబ్బకు ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాప్‌ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ టాప్‌ కంపెనీ బీఎండబ్ల్యూ  భారత మార్కెట్‌లో బీఎండబ్ల్యూ సీఈ 04ను లాంచ్‌ చేసింది.

BMW Scooter: మార్కెట్‌లోకి సూపర్‌ స్టైలిష్‌ బీఎండబ్ల్యూ స్కూటర్‌ రిలీజ్‌.. ధర ఎంతంటే..?
Bmw Ce 04 Electric Scooter
Follow us
Srinu

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 27, 2024 | 6:56 PM

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం దెబ్బకు ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాప్‌ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ టాప్‌ కంపెనీ బీఎండబ్ల్యూ  భారత మార్కెట్‌లో బీఎండబ్ల్యూ సీఈ 04ను లాంచ్‌ చేసింది. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్‌ యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్‌తో వచ్చే ఈ స్కూటర్‌ పట్టణ ప్రాంత ప్రజలకు అనువుగా ఉంటుందని బీఎండబ్ల్యూ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ సీఈ-04 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

తాజా లాంచ్‌ గురించి బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ పవా మాట్టాడుతూ బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియాలో సరికొత్త ఎలక్ట్రో-మొబిలిటీకి సంబంధించి సరికొత్త శకానికి నాంది పలుకుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలను టార్గెట్‌ చేస్తూ బీఎండబ్ల్యూ సీఈ-04 లాంచ్‌ చేసిందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి సౌండ్‌ లేకుండా ఈ స్కూటర్‌పై సింపుల్‌గా చక్కర్లు కొట్టవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్టైలిష్‌ లుక్‌తో పాటు సైడ్-లోడింగ్ హెల్మెట్ కంపార్ట్‌మెంట్, ఛార్జింగ్ పోర్ట్ డిజైన్‌ మిలితమై వస్తాయని వివరిస్తున్నారు. లిక్విడ్-కూల్డ్ పర్మనెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్ 42 హెచ్‌పీ ద్వారా ఈ స్కూటర్‌ శక్తిని పొందుతుంది. అలాగే కేవలం 2.6 సెకన్లలో 50 కిలోమీటర్ల వేగాన్ని ఈ స్కూటర్‌ అందుకుంటుందని వివరిస్తున్నారు. 120 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లే ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే 130 కిలో మీటర్ల మైలేజ్‌ అందిస్తుంది. 

స్ప్లిట్-స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీతో 10.25 అంగుళాల కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే రైడర్లను అమితంగా ఆకట్టుకుంటుంది. కీలెస్ రైడ్, రివర్సింగ్ ఎయిడ్, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో వచ్చే ఈ స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఎకో, రెయిన్‌, రోడ్‌ రైడింగ్‌ మోడ్స్‌ ద్వారా రైడర్లు అధునాతన రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పొందుతారు. అయితే భారతదేశంలో బీఎండబ్ల్యూ సీఈ-04 ధర రూ.రూ. 14,90,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ స్కూటర్‌ సెప్టెంబర్ 2024 నుంచి భారతదేశంలోని ఎంపిక చేసిన మెట్రోపాలిటన్ నగరాల్లో అందుబాటులో ఉంటుందని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..