AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastag: పదే పదే హైవేపై ప్రయాణిస్తున్నారా.? టోల్‌ ఛార్జీలను తగ్గించుకోండిలా!

హైవే డ్రైవర్లకు కొనసాగుతున్న ఒత్తిడి తగ్గబోతోంది. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) తమ 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ రెండు గమ్యస్థానాల మధ్య అతి తక్కువ టోల్ ఛార్జీలతో కూడిన హైవే మార్గాన్ని గుర్తించడంలో ప్రయాణికులకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ NHAI ను జులై 2025 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

Fastag: పదే పదే హైవేపై ప్రయాణిస్తున్నారా.? టోల్‌ ఛార్జీలను తగ్గించుకోండిలా!
Rajyamarg Yatra App
Anand T
|

Updated on: Jun 27, 2025 | 9:23 PM

Share

హైవే డ్రైవర్లకు కొనసాగుతున్న ఒత్తిడి తగ్గబోతోంది. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) తమ ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ రెండు గమ్యస్థానాల మధ్య అతి తక్కువ టోల్ ఛార్జీలతో కూడిన హైవే మార్గాన్ని గుర్తించడంలో ప్రయాణికులకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ NHAI ను జులై 2025 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని ఎన్‌హెచ్‌ఏఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2023లో ప్రారంభమైన రాజ్‌మార్గ్ యాత్ర యాప్, భారతీయ జాతీయ రహదారులపై లభ్యమయ్యే సౌకర్యాల గురించి వినియోగదారులకు సమాచారం అందిస్తుంది. ఇప్పుడు, ఈ యాప్ రెండు ప్రదేశాల మధ్య వివిధ మార్గాల్లో విధించే టోల్ ఛార్జీల వివరాలను కూడా ప్రియాణికులకు తెలియజేయనుంది. అంతేకాదు రెండు ప్రాంతాల మధ్య అత్యల్ప టోల్ ఛార్జీలు ఉన్న రహదారులను కూడా తెలియజేస్తుంది.

ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ (ఐహెచ్‌ఎంసీఎల్) ఎఫిషియంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అమృత్ సింగ్ మాట్లాడుతూ ఈ ఫీచర్‌ను ఎలా వినియోగించుకోవాలని వివరించారు. ఉదాహరణకు, ఢిల్లీ నుండి లక్నోకు ప్రయాణించడానికి మూడు వేర్వేరు మార్గాలు ఉంటే.. వాటిలో అతి తక్కువ టోల్ చార్జీలు కలిని మార్గాన్ని ఈ యాప్ ప్రయాణీకులకు చూయిస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణీకులు యమునా ఎక్స్‌ప్రెస్‌వే, ఘజియాబాద్-అలీగఢ్-కాన్పూర్ మార్గం లేదా మొరాదాబాద్-బరేలీ-సీతాపూర్ మార్గం ద్వారా ప్రయాణించవచ్చని సింగ్ పేర్కొన్నారు. ఈ యాప్ రెండు నగరాల మధ్య అత్యల్ప టోల్ ఛార్జీలు ఉన్న మార్గాన్ని గుర్తిస్తుందని ఆయన తెలిపారు.

వార్షిక FASTag కోసం మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?..

NHAI ఇటీవల FASTag వార్షిక పాస్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 3,000, ఈ పాస్ ఏ హైవేలోనైనా 200 టోల్-ఫ్రీ ట్రిప్పులను అనుమతిస్తుంది. దీని వ్యాలిడిలీ వన్‌ ఇయర్ వరకు ఉంటుంది. ఈ కొత్త FASTag రూల్స్‌ ఆగస్టు 15, 2025 నుండి అమలులోకి రానున్నాయి. అయితే పాస్ గడువు ముగిసేలోపు మీరు 200 టోల్-ఫ్రీ ట్రిప్పులను పూర్తి చేస్తే, మీరు మీళ్లీ FASTagను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వార్షిక పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, వినియోగదారులు NHAI వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా హైవే యాత్ర యాప్‌లో కూడా దరఖాస్తు చేసుకొవచ్చు. మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను యాప్‌లో అప్‌లోడ్ చేసి యాక్టివ్ FASTag వివరాలను వారు ధృవీకరించాలి. ఆ తర్వాత, రూ. 3,000 ఒకేసారి చెల్లింపు చేయాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us