AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Latest electric cars: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు పండగే.. సూపర్ ఫీచర్స్‌తో లాంచ్‌కు రెడీ

మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు జోరందుకున్నాయి. మెరుగైన ఫీచర్లు, మంచి రేంజ్, అందుబాటు ధరలో లభిస్తున్న వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. పలు కార్ల తయారీ కంపెనీలు ఈ విభాగంలో తమ మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

Latest electric cars: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌కు పండగే.. సూపర్ ఫీచర్స్‌తో లాంచ్‌కు రెడీ
Ev Cars
Nikhil
|

Updated on: Apr 01, 2025 | 8:00 PM

Share

ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ విభాగం టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి, టాటా, కియా, మహీంద్రా, ఎంజీ తదితర కంపెనీలు రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను విడుదల చేయనున్నాయి. వాటి వివరాలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

మారుతీ సుజుకి ఇ-విటారా

మారుతీ సుజుకీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇ-విటారాను విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. త్వరలోనే ఈ కారు మార్కెట్ లోకి రానుంది. ఈ కారును రెండు రకాల బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. బేస్ వేరియంట్ లో 48.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. జీటా, అల్పా వేరియంట్లకు పెద్ద బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవచ్చు. నెక్సా డీలర్ షిప్ ల ద్వారా ఇ-విటారా కారును విక్రయించనున్నారు.

టాటా హారియల్ ఈవీ

ప్రముఖ కంపెనీ టాటా నుంచి హారియల్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ విడుదల కానుంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన మొబిలిటి గ్లోబల్ ఎక్స్ పో 2025లో ఈ కారు మోడల్ ను ప్రదర్శనకు ఉంచారు. త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. హారియల్ ఈవీలో 75 కేడబ్ల్యూహెచ్ లిథియం – అయాన్ బ్యాటరీ అమర్చారు. సింగిల్ చార్జింగ్ తో సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

కియా ఈవీ6 ఫేస్ లిఫ్ట్

కియా మోటార్స్ నుంచి ఈవీ6 ఫేస్ లిఫ్ట్ త్వరలో విడుదల కానుంది. తన ఫ్లాగ్ షిఫ్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ వెర్షన్ ను కంపెనీ నవీకరించింది. గతంలో ఎక్కువ సామర్థ్యం కలిగిన 84 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని దీనిలో ఏర్పాటు చేశారు. దీంతో రేంజ్ కూడా మరింత పెరగనుంది. ఆకట్టుకునే ఎక్స్ టీరియర్ డిజైన్ తో పాటు అనేక ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ వో

మహీంద్రా నుంచి కొత్త ఎక్స్ యూవీ 3ఎక్స్ వో ఎలక్ట్రిక్ కారు త్వరలో విడుదల కానుంది. ఈ కారు గతంలో చాలా ప్రదర్శనల్లో కనిపించింది. త్వరలోనే మార్కెట్ లోకి విడుదల కానుందని సమాచారం. ఇది ఎక్స్ యూవీ 400 కంటే చిన్నగా ఉంటుంది. టాటా పంచ్ తో ఈ కారుకు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

ఎంజీ నుంచి మూడు కార్లు

ఎంజీ మోటార్స్ నుంచి త్వరలో మూడు ఎలక్ట్రిక్ కార్లు విడుదల కానున్నాయి. వీటిలో సైబర్ స్టర్, ఎం9 ఎంపీవీ కార్లు ఎంజీ ప్రీమియం అవుట్ లెట్ నుంచి విక్రయించనున్నారు. మూడో మోడల్ అయిన విండ్సర్ లో 50 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమర్చారు. సింగిల్ రీచార్జితో సుమారు 460 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..