Stock Market: బిగినింగ్‌లోనే బిగ్గెస్ట్ షాక్ – భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
బిగినింగ్‌లోనే బిగ్గెస్ట్ షాక్ తగిలింది. కొత్త ఆర్ధిక సంవత్సరం భారీ నష్టాలతో మొదలైంది. స్టాక్‌మార్కెట్ల భారీ పతనంతో లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఊడ్చిపెట్టుకుపోయింది. ఆరంభంలోనే ఎందుకింత నష్టం...? మార్కెట్ సెంటిమెంట్‌ను అమెరికా టారిఫ్ భయాలు దెబ్బతీశాయా..? ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

ఇండియన్ స్టాక్ మార్కెట్స్‌లో భూకంపం వచ్చింది. ఏప్రిల్ మాసం ఆరంభంలోనే భారీ నష్టాలను మోసుకొచ్చింది. ఇవాళ ఒడిదొడుకులతో మొదలైన బెంచ్ మార్క్ సూచీలు సమయం గడిచేకొద్ది భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. టోటల్‌గా మార్కెట్స్ ముగిసే సమయానికి 1390 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ షాక్ ఇస్తే… 353 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తంగా ఏప్రిల్ ఫస్ట్… బిగ్గెస్ట్ లాస్‌ను తెచ్చి పెట్టింది. ఫలితంగా లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.12 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3160 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ప్రతీకార టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి .దేశీయ ఐటీ కంపెనీలకు అమెరికా నుంచే ప్రధానంగా ఆదాయం వస్తుంది. అలాంటిది అమెరికాలో ఐటీకి ఆశించిన మేర డిమాండ్ ఉండకపోవచ్చన అంచనాలతో ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా భారీ స్టాక్స్ మార్కెట్స్ భారీగా నష్టపోయాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి