Whatsapp: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్..ఐఫోన్ వినియోగదారులకు పండగే..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కు ఎంతో ఆదరణ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు దీన్ని ఉపయోగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుంది. యాప్ లో ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. వారందరూ కాల్స్, మెసేజ్ ల కోసం వాట్సాప్ ను డిఫాల్ట్ యాప్ గా సెట్ చేసుకోవచ్చు. దీని వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త ఫీచర్ ద్వారా ఐఫోన్ యూజర్లు వేర్వేరు యాప్ లకు మారాల్సిన అవసరం ఉండదు. వాట్సాప్ నుంచి నేరుగా కాల్స్ చేసుకునే వీలుంటుంది. అలాగే మెసేజ్ లు కూడా పంపుకోవచ్చు. లేటెస్ట్ ఐఓఎస్ 18.2 అప్ డేట్ తో కాల్స్ చేసేటప్పుడు, మెసేజ్ లు పంపేటప్పుడు డిఫాల్ట్ ఫోన్ లేదా మెసేసింగ్ యాప్ కు బదులు వాట్సాప్ ను ఓపెన్ చేయవచ్చు. బ్రౌజింగ్ తో పాటు ఇ-మెయిల్ పంపేందుకు ఉపయోగించుకోవచ్చు.
- ఆపిల్ ఐఫోన్ లో డిఫాల్ట్ కాలింగ్, టెస్టింగ్ యాప్ గా వాట్సాప్ ను సెట్టింగ్ చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయి.
- మీ కాంటాక్ట్ ల్లోని, ఇతర యాప్ ఫోన్ నంబర్ నొక్కడం వల్ల ఆపిల్ ఫోన్, మెసేజెస్ యాప్ కు బదులుగా వాట్సాప్ వెంటనే ఓపెన్ అవుతుంది.
- అదనపు దశలు లేకుండా వాట్సాప్ నుంచి నేరుగా కాల్స్ చేసుకోవడంతో పాటు సందేశాలు పంపవచ్చు.
- కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ను ఎక్కువగా వినియోగించే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
- ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. మీరు టెస్ట్ ఫైట్ బీటా ప్రోగ్రామ్ లో భాగమైతే, ఇప్పటికే మీ వాట్సాప్ సెట్టింగ్ లలో ఈ ఫీచర్ కనిపిస్తుంది.
ఈ కొత్త ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ను అప్ డేట్ చేయాలి. ఐఫోన్ లో సెట్టింగ్, యాప్స్, డిఫాల్ట్ యాప్ లకు వెళ్లాలి. కాల్స్, మెసేజ్ ల డిఫాల్ట్ గా వాట్సాప్ ను ఎంపిక చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత కాంటాక్ట్ నంబర్, మెసేజ్ బటన్ ను ట్యాప్ చేయాలి. తద్వారా బిల్ట్ ఇన్ యాప్ లకు బదులుగా ఆటోమేటిక్ గా వాట్సాప్ ను ఓపెన్ చేయవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వాట్సాప్ ను వినియోగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీన్ని వ్యక్తిగత చాట్ లు, గ్రూప్ సంభాషణలు, వ్యాపార అవసరాల కోసం కూాడా వాడుకోవచ్చు. అలాగే సమయం చాలా ఆదా అవుతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కారణంగా కాల్స్, మెసేజ్ లు ప్రైవేటుగా ఉంటాయి. అంతర్జాతీయ కాల్స్ ను ఉచితంగా చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను చాలా సురక్షితంగా పంపుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి