AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్.. ఈ రూట్‌లో సర్వీసులు.. ఎప్పటినుంచంటే..?

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య స్లీపర్ రైలును రాబోయే కొద్ది నెలల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక భవిష్యత్తులో బుల్లెట్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాంతాల మధ్య బుల్లెట్ ట్రైన్ నడపనున్నారు.

Indian Railway: తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్.. ఈ రూట్‌లో సర్వీసులు.. ఎప్పటినుంచంటే..?
Bullet Train
Venkatrao Lella
|

Updated on: Jan 02, 2026 | 9:15 PM

Share

భారతదేశంలో రైల్వే వ్యవస్థ ఈ ఏడాది రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. రైల్వేల స్వరూపం కొత్త రూపు దిద్దుకోనుంది. ఈ ఏడాది కొత్తగా భారతీయ రైల్వేలోకి వందే భారత్ స్లీపర్ రైళ్లు ఎంట్రీ ఇవ్వనుండగా.. వచ్చే ఏడాది బుల్లెట్ రైళ్లు పట్టాలపై పరుగుల పెట్టనున్నాయి. దీంతో రానన్న రెండేళ్లల్లో భారత్‌లో రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు. జనవరిలో గువహతి-హౌర్ మధ్య తొలి వందే భారత్ రైలు రానుండగా.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా రైల్వేశాఖ విడతల వారీగా ప్రవేశపెట్టనుంది. 2026 చివరికల్లా ఏకంగా 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

వచ్చే ఏడాది బుల్లెట్ రైళ్లు

ఇక వచ్చే ఏడాది భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికీ ఇందుకు సంబంధించి ట్రాక్ తయారీ పనలు జరుగుతుండగా.. తొలి బుల్లెట్ ట్రైన్‌ను ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రారంభించనున్నారు. 2027 ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత థానే-ముంబై, వాపి-సూరత్, వాపి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్స్ విడతల వారీగా రానున్నాయి. ఇందుకోసం ఆయా మార్గాల్లో బుల్లెట్ రైళ్ల కోసం ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ సొరంగాలు మీదుగా పట్టాలు నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. వీటి వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

తెలుగు రాష్ట్రాలకు బుల్లెట్ ట్రైన్

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తులో బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది సికింద్రాబాద్ నుంచి బయల్దేరి విజయవాడ, గుంటూరు మీదగా బెంగళూరు వెళ్లనుంది. వచ్చే ఏడాదిలో అమరావతి, హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభం కావోచ్చని చెబుతున్నారు. 2023 నాటికి పనులు స్టార్ట్ అవుతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ, హైదరాబాద్ పారిశ్రామికంగా మరింతగా అభివృద్ది సాధించనున్నాయి. అలాగే లక్షల మందికి ఉపాధి కలగనుంది. పర్యాటకం, వ్యాపార రంగాలు బాగా అభివృద్ది చెందనున్నాయి. 2027లో భారత్‌లో బుల్లెట్ రైళ్ల శకం మొదులకానుండటంతో రవాణా రంగం మరింతగా డెవలప్ కానుంది.

తెలుగు రాష్ట్రాల మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఈ రూట్లో సర్వీసులు
తెలుగు రాష్ట్రాల మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఈ రూట్లో సర్వీసులు
70లోనూ 20లా ఉండాలా? హార్వర్డ్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన డైట్ ఇదే
70లోనూ 20లా ఉండాలా? హార్వర్డ్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన డైట్ ఇదే
నగ్నంగా నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందా.. అసలు నిజాలు తెలిస్తే షాక్
నగ్నంగా నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందా.. అసలు నిజాలు తెలిస్తే షాక్
రోడ్లపై కంటికి కనిపించని మృత్యువు..! అలర్ట్‌గా లేకపోతే అంతే
రోడ్లపై కంటికి కనిపించని మృత్యువు..! అలర్ట్‌గా లేకపోతే అంతే
ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
బంగారం Vs వెండి Vs స్టాక్స్.. 2026లో కాసుల వర్షం కురిపించేది..
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
చలిమంటలతో తస్మాత్ జాగ్రత్త...
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
కొత్త ఏడాదిలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
తెలంగాణలో టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం.. ఇదిగో పూర్తి వివరాలు
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే
వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే