Indian Railways: రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. గ్యాస్ కొరత వేళ రైల్వేశాఖ సంచలన నిర్ణయం..?
రైల్వే ప్రయాణికులకు షాక్ తగలనుంది. రైళ్లల్లో క్యాటరింగ్ సర్వీసులను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని రైల్వేశాఖ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తతుం ఇది పరిశీలనలో ఉండగా.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.గ గ్యాస్ కొరత క్రమంలో రైలవ్ే వర్గాలు ఈ నిర్ణయం తీసుకోనున్నాయి.

గల్ప్ దేశాల్లో యుద్ద ప్రభావంతో అక్కడి నుంచి రావాల్సిన సరఫరా నిలిచిపోవడంతో దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఏర్పడింది. దేశంలోని హోటల్స్, రెస్టారెంట్లపై ఇది ప్రభావం చూపుతుండగా.. రైల్వే క్యాటరింగ్ సేవలపై కూడా ఎఫెక్ట్ పడింది. రైళ్లల్లో తాజా ఆహారాన్ని ప్రయాణికులకు రైల్వేశాఖ సరఫరా చేస్తోంది. అయితే గ్యాస్ కొరత వల్ల ఆహార పదార్ధాలను వండటంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో క్యాటరింగ్ సర్వీసులను కొన్ని రోజుల పాటు ఆపేయాలని రైల్వేశాఖ భావిస్తోన్నట్లు సమాచారం. అయితే రైల్వే బోర్డు దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో టికెట్‌తో పాటు ఫుడ్ బుక్ చేసుకున్నవారికి రైళ్లల్లోనే తాజా ఆహార పదార్ధాలను అందిస్తున్నారు. క్యాటరింగ్ సర్వీసులను నిలిపివేస్తే.. ఫుడ్ బుక్ చేసుకున్నవారికి ఐఆర్‌సీటీసీ రీఫండ్ ఇవ్వనుంది.
క్యాటరింగ్ సేవలు నిలిపివేత..?
రైల్వే ప్రయాణికులకు అందించే ఫుడ్ ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్‌లో తయారవుతుంది. దీనిని పాంట్రీ కార్లకు పంపించే ముందు తయారుచేస్తారు. ప్రతీ రోజు ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ సిస్టమ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 17 లక్షల భోజనాలు అందిస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఇలాగే కొనసాగితే క్యాటరింగ్ సేవలను నిలిపివేయాలని ఐఆర్‌సీటీసీ వర్గాలు భావిస్తున్నాయి. ఎల్పీజీ లభ్యతలో అంతరాయం కలిగితే భోజనం తయారీ, రైళ్లకు సరఫరాపై ప్రభావం చూపుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఇప్పటికే భోజనం బుక్ చేసుకుని ఉంటే తిరిగి వాటికి డబ్బులు చెల్లిస్తామని అన్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. దీంతో వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అదే తరహాలో రైల్వేశాఖపై కూడా ఇది ప్రభావం చూపనుంది.
రైల్వే స్టేషన్లలో ఇండక్షన్ స్టవ్‌లు
ఇక వంట గ్యాస్ కొరత క్రమంలో ప్రయాణికులకు ఆహార సేవల్లో అంతరాయం కలగకుండా ఐఆర్‌సీటీసీ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్లాజాలకు కీలక ఆదేశాలిచ్చింది. హైక్రోవేవ్, ఇండక్షన్ కుక్కర్లను వినియోగించాలని సూచించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకోవాలని తెలిపింది. రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లు రెడీ టు ఈట్ ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని సూచించింది. ప్రయాణికులకు ఆహారం, పానీయాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్లాజాలు అన్నీ ఈ ఆదేశాలను పాటించాలని సూచించింది. రైల్వే స్టేషన్లలో జన్ ఆహారర్ వంటి అవుట్లెట్లలో సాధారణ కార్యకలాపాలు జరిగేలా చేసేందుకు ఐఆర్‌సీటీసీ నిర్ణయం తీసుకుంది.
