AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Medicine: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మెడిసిన్స్‌పై క్యూఆర్‌ కోడ్‌లు.. ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే..

నకిలీ ఔషధాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ మందులు విచ్చల విడిగా సరఫరా అవుతోన్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో మెడిసిన్స్‌పై క్యూఆర్‌ కోడ్‌ (బార్‌కోడ్‌)ను ముద్రించనున్నారు. దీనివల్ల..

Fake Medicine: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మెడిసిన్స్‌పై క్యూఆర్‌ కోడ్‌లు.. ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే..
QR Code On Medicine
Narender Vaitla
|

Updated on: Dec 05, 2022 | 10:35 AM

Share

నకిలీ ఔషధాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ మందులు విచ్చల విడిగా సరఫరా అవుతోన్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో మెడిసిన్స్‌పై క్యూఆర్‌ కోడ్‌ (బార్‌కోడ్‌)ను ముద్రించనున్నారు. దీనివల్ల నకిలీ మందులకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్ర యోచిస్తోంది. 2023 ఆగస్టు 1వ తేదీని నుంచి మెడిసిన్స్‌పై క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఔషధాలను తయారు చేసే అన్ని ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కోన్‌ చేయడం ద్వారా ఫేక్‌ మెడిసిన్‌ను గుర్తించవచ్చు. బ్రాండ్ పేరు, ఫార్మా కంపెనీ పేరు దాని అడ్రస్‌, డ్రగ్ బ్యాచ్ నంబర్, మెడిసిన్‌ తయారు తేదీ, ఎక్సైపయిరీ తేదీ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. సుమారు 300 ఫార్మా కంపెనీలు ఈ బార్‌కోడ్‌ను అమలు చేయనున్నాయి. 2022 జూన్‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయంపై వారి అభిప్రాయాన్ని కోరుతూ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అనంతరం ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని రూల్ 96లోని హెచ్2 ప్రకారం, ఇప్పుడు 300 ఔషధ కంపెనీలు తమ ప్రాథమిక, ద్వితీయ శ్రేణిలో బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను ముద్రించాల్సిన అవసరం వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మధ్యతరగతి, తక్కువ-ఆదాయ దేశాలలో నకిలీ మందుల వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ దేశాల్లో 10 శాతం వైద్య వస్తువులు నకిలీవే కావడం గమనార్హం. అలాంటి పరిస్థితిలో, ఇది ప్రజల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనతో ప్రజలు నాణ్యమైన మెడిసిన్స్‌ పొందే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..