Stock Market: యూఎస్ స్టాక్ మార్కెట్లు ఇండియాపై ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 18,400 వద్ద 245 పాయింట్ల నష్టంతో ముగియగా, సెన్సెక్స్..
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 18,400 వద్ద 245 పాయింట్ల నష్టంతో ముగియగా, సెన్సెక్స్ 879 పాయింట్లు నష్టంతో 61,799 వద్ద ముగిసింది. అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు.. సమయం గడుస్తున్న కొద్దీ కనిష్ఠాలను నమోదు చేశాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, అలాగే అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. దీంతో మదుపర్ల సంపద భారీగా నష్టం వాటిల్లింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుదల ఇన్వెస్టర్స్ సెంటిమెంట్స్‌ను దెబ్బతీసింది .
బలహీనమైన గ్లోబల్ సూచనల మధ్య, యూఎస్ ఫెడ్ అంచనా వేసిన 50-bps రేటు పెంపు తర్వాత, దేశీయ సూచీలు ఫ్లాట్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. రోజు గడుస్తున్నకొద్ది నష్టాలను పొడిగించాయి. ఇది రోజు కనిష్ట స్థాయికి చేరుకుంది. టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐషర్ మోటార్స్ అత్యధికంగా నష్టపోయిన నిఫ్టీలలో ఉండగా, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్‌టిపిసి, సన్ ఫార్మా టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
అన్ని రంగాల సూచీలు నిఫ్టీ బ్యాంక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ 1-2 శాతం చొప్పున నష్టాల్లో ముగియగా, ఆటో, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.5 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.6-1 శాతం మధ్య నష్టపోయాయి. బిఎస్‌ఇలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2 శాతం క్షీణించగా, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, మెటల్, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి చొప్పున క్షీణించాయి.
బీఎస్ఈలో ఎల్అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఐడీబీఐ బ్యాంక్, కామత్ హోటల్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి