AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CIBIL Score Increase Tips: సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో బ్యాంక్ లోన్ రావడం లేదా?.. ఇలా చేస్తే స్కోర్ వేగంగా, ఈజీగా పెరుగుతుంది

సిబిల్ స్కోర్ అంటే మన ఆర్ధిక ఎదుగుదలకు దిక్సూచి. ఈ సిబిల్ స్కోర్ సరిగ్గా ఉన్నప్పుడే బ్యాంకు నుంచి రుణం లభిస్తుంది. దాన్ని పరిష్కరించడానికి సులభమైన మార్గాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

CIBIL Score Increase Tips: సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో బ్యాంక్ లోన్ రావడం లేదా?.. ఇలా చేస్తే స్కోర్ వేగంగా, ఈజీగా పెరుగుతుంది
Cibil Score
Sanjay Kasula
|

Updated on: Dec 15, 2022 | 2:56 PM

Share

మీరు వ్యాపారం చేస్తున్నా.. లేదా మీరు ఉద్యోగం, వృత్తిలో చాలా బిజీగా ఉన్నా.. కొన్నిసార్లు లోన్ తీసుకోవల్సి వస్తుంది. కానీ ఒక వ్యక్తి సిబిల్ స్కోర్ బాగున్నప్పుడే బ్యాంకు నుంచి రుణం లభిస్తుంది. ఏదైనా బ్యాంకు మీకు రుణం ఇవ్వాలంటే ముందుగా సిబిల్ స్కోర్‌ను చెక్ చేస్తుంది. అది బాగా లేకుంటే లోన్ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. ఇలాంటి సమయంలో, రుణం లభించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.. మీరు మీ CIBIL స్కోర్‌ను ఎలా పరిష్కరించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

సిబిల్ స్కోర్‌ను పెంచుకునే ఈజీ మార్గాలు..

  • మీ CIBIL స్కోర్ స్థిరంగా ఉండాలని మీరు కోరుకుంటే.. మీరు ఇప్పటికే తీసుకున్న ఏదైనా లోన్ సకాలంలో చెల్లించాలని మాత్రం గుర్తుంచుకోండి. ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు.
  • మీరు మీ క్రెడిట్ నివేదికను ఓ సారి చెక్ చేసుకోండి. చాలా సార్లు మీర తీసుకున్న లోన్ పూర్తిగా చెల్లించినప్పుడు ఆ లోన్‌ పూర్తిగా క్లోజ్ చేసుకోండి. లేకుంటే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల, లోన్ యాక్టివ్‌గా చూపబడుతోంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.
  • మీరు మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచాలనుకుంటే, ప్రతిసారీ మీ క్రెడిట్ బిల్లును సకాలంలో చెల్లించండి. మీపై ఎలాంటి రుణం బకాయి ఉండకుండా చూసుకోండి. ఇది మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది.
  • మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచడానికి లోన్ గ్యారెంటర్‌గా మారడం మానుకోండి. ఇది కాకుండా, ఉమ్మడి ఖాతా కూడా తెరవవద్దు. ఇలా చేయడం వల్ల ఉమ్మడి ఖాతాలోని వ్యక్తి  డిఫాల్ట్ అయితే, దాని ప్రభావం మీ సిబిల్ స్కోర్‌పై పడుతుంది.
  • మీరు సిబిల్ స్కోర్‌ని ఫిక్స్ చేయాలనుకుంటే, ఒకేసారి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవద్దని మాత్రం గుర్తుంచుకోండి. మీరు కలిసి అనేక రుణాలు తీసుకుంటే.. వాటిని తిరిగి చెల్లించడంలో జాప్యం జరగవచ్చు. సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంటుంది.
  • మీరు మీ సిబిల్ స్కోర్‌ని మెరుగుపరచాలనుకుంటే, మీరు ఎప్పుడు లోన్ తీసుకున్నా.. లాంగ్ టర్మ్ లోన్ తీసుకోండి. ఇలా చేయడం ద్వారా, EMI మొత్తం తక్కువగా ఉంటుంది. మీరు దానిని సులభంగా చెల్లించవచ్చు. మీరు సమయానికి చెల్లించినప్పుడు.. మీ సిబిల్ స్కోర్ దానిచ్చి అదే పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం