Business Ideas: సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ స్మాల్ బిజినెస్ స్టార్ చేసేయండి!
ప్రస్తుతం ఒకే ఆదాయంతో జీవించడం కష్టం. ముఖ్యంగా పల్లెల్లో నివసించే ఉద్యోగులకు రెండవ ఆదాయం కష్టం. అలాంటి వారికి తక్కువ పెట్టుబడితో (రూ.1 లక్ష) ఫ్లోర్ మిల్ వ్యాపారం ఒక చక్కటి మార్గం. ఉద్యోగం చేస్తూనే ఉదయం, సాయంత్రం వేళల్లో పిండి మిల్లు నడుపుతూ అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో కేవలం ఒకే ఇన్‌కమ్‌పై లైఫ్‌ను లీడ్ చేయడం కష్టంగా మారుతోంది. అందుకే చాలా మంది కచ్చితంగా సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారు. భార్యభర్తలు ఇద్దరూ వర్క్ చేయడం, లేదా ఉద్యోగం చేస్తూ ఏదో చిన్న పాటి వ్యాపారం చేయడం వంటి చేస్తున్నారు. అయితే సెకండ్ ఇన్‌కమ్ ఎక్కువగా సిటీలో ఉండేవారికి ఈజీగా ఉంటుంది. వారికి ఏదో ఒక పని లభిస్తుంది.
కానీ పల్లెల్లో ఉంటూ సెకండ్ ఇన్‌కమ్ పొందడం అంత సులువు కాదు. వ్యవసాయం చేస్తూ వ్యవసాయ ఆధారిత పాడితో ఆదాయం పొందడం మాత్రమే కాకుండా.. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూర్లో ఉంటూ ఉంటారు. అలాంటి వారు సెకండ్ ఇన్‌కమ్ పొందాలంటే చాలా కష్టం. మరి అలాంటి వారికి ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది. తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే.. జాబ్ చేసుకుంటూనే సెకండ్ ఇన్‌కమ్ కూడా పొందవచ్చు. ఇంతకీ బిజినెస్ ఏంటంటే.. ఫ్లోర్ మిల్.
ఇంట్లో పిండి మిల్లులు ఏర్పాటు చేసుకుంటే.. ఉదయం, సాయంత్రం దాని నుంచి ఆదాయం పొందవచ్చ. జాబ్ చేసుకుంటూనే ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఊర్లలో చాలా మంది వ్యవసాయ పనుకే వెళ్తుంటారు. సో.. వాళ్లు ఉదయం, సాయంత్ర సమయాల్లోనే పిండి, కారం వంటివి పట్టించేందుకు వస్తుంటారు. 9 టూ 5 జాబ్ చేసుకుంటూ ఫ్లోర్ మిల్ నడిపించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మిల్లులు కొనాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ కేటగిరి కరెంట్ మీటర్ కూడా అవసరం అవుతుంది. మొత్తంగా ఒక రూ.1 లక్ష పెట్టుబడితో ఈ వ్యాపారం అయితే మొదలుపెట్టవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
