AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SEBI KYC Rules: కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు సులభతరం చేసేలా ప్రణాళికలు

కొత్త ఫ్రేమ్‌వర్క్ కింద కేఆర్ఏలు ఇప్పుడు అధికారిక డేటాబేస్‌ల నుంచి పాన్, పేరు, చిరునామా, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించవచ్చు. ఈ వివరాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తిస్తే అవి చెల్లుబాటు అయ్యే రికార్డులుగా పరిగణిస్తారని వివరిస్తున్నారు. కాబట్టి కొత్త ఫ్రేమ్‌వర్క్ చాలా మంది పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తుంది.

SEBI KYC Rules: కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు సులభతరం చేసేలా ప్రణాళికలు
E Kyc
Nikhil
|

Updated on: May 18, 2024 | 6:23 PM

Share

కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల ద్వారా నో యువర్ కస్టమర్ రికార్డులను ధృవీకరించడానికి రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఈ చర్య పెట్టుబడిదారులకు లావాదేవీలను సులభతరం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.  కొత్త ఫ్రేమ్‌వర్క్ కింద కేఆర్ఏలు ఇప్పుడు అధికారిక డేటాబేస్‌ల నుంచి పాన్, పేరు, చిరునామా, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించవచ్చు. ఈ వివరాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తిస్తే అవి చెల్లుబాటు అయ్యే రికార్డులుగా పరిగణిస్తారని వివరిస్తున్నారు. కాబట్టి కొత్త ఫ్రేమ్‌వర్క్ చాలా మంది పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తుంది. పెట్టుబడిదారుల డిజిటల్ గుర్తింపుల ధ్రువీకరణను కూడా నిర్ధారిస్తుంది. 

పెట్టుబడి కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను స్వీకరించే పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్నందున డిజిటల్ గుర్తింపులను ధ్రువీకరించడం చాలా ముఖ్యమైందని నిపుణులు వివరిస్తున్నారు. ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు, సంబంధిత మధ్యవర్తులు మే చివరి నాటికి తమ సిస్టమ్‌లలో అవసరమైన సాంకేతిక మార్పులను అమలు చేయడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, బ్రోకింగ్ సంస్థలు, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్లు పెట్టుబడిదారుల డేటా గోప్యత, భద్రతను కాపాడేందుకు మంచి సమ్మతి సాధనాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లను అమలు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు ధ్రువీకరణ తర్వాత పెట్టుబడిదారులందరూ ఆన్‌బోర్డ్‌లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఇది సహాయపడుతుంది.

కేఆర్ఏలు, సీఏఎంఎస్ కేఆర్ఏ, బీఎస్ఈ కేఆర్ఏ, ఎన్ఎస్ఈ కేఆర్ఏ వంటి ఎంటీటీలు ఉంటాయి. ఈ ఏజెన్సీలు వ్యక్తులకు సంబంధించిన కేవైసీ వివరాలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తాయి. సాధారణంగా బ్రోకర్లు, ఎక్స్ఛేంజీలు, మధ్యవర్తుల నుండి సమాచారాన్ని సేకరిస్తాయి. సెక్యూరిటీస్ మార్కెట్‌లో వాటాదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా క్లయింట్‌ల లావాదేవీల సౌలభ్యం కోసం రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను సెబీ సులభతరం చేసింది. మార్గదర్శకాన్ని సరళీకృతం చేస్తూ రెగ్యులేటర్ అక్టోబర్ 2023లో జారీ చేసిన సర్క్యులర్‌ను సవరించింది. తేడాది అక్టోబర్‌లో, ధ్రువీకరణ ప్రక్రియ నవీకరణకు గురైంది. రేషన్ కార్డ్‌లు, ఎలక్ట్రిక్ బిల్లులు లేదా స్కాన్ చేసిన ఆధార్ కార్డ్‌లు వంటి చిరునామా రుజువులను చెల్లుబాటు చేయకుండా చేసింది. ప్రస్తుతం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్), పేరు, చిరునామాతో సహా కేవైసీ రికార్డ్‌ను స్వీకరించిన రెండు రోజులలోపు క్లయింట్ రికార్డ్‌లకు సంబంధించిన నిర్దిష్ట లక్షణాలను ధ్రువీకరించడం కేఆర్ఏలకు అవసరం.

ఇవి కూడా చదవండి

సెబీకు సంబంధించిన ఈ చొరవ సెక్యూరిటీలలో పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, సెక్యూరిటీ మార్కెట్ల అభివృద్ధి మరియు నియంత్రణను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇది వినియోగదారుల రక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. సెబీకు సంబంధించిన చర్య క్యాపిటల్ మార్కెట్‌లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, సెక్యూరిటీ మార్కెట్ల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది డిజిటల్ నమ్మకాన్ని పెంపొందించడానికి పెట్టుబడిదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us