BIHAR SHOES : ఎల్లలు దాటిన వ్యాపారం.. రష్యా సైనికుల కాళ్లకు బీహార్ మహిళలు చేసిన బూట్లు..!

సామాన్యుల అవసరాలకు.. సైనికుల అవసరాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. క్లిష్టమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో నిత్యం ప్రమాదాలను ఎదుర్కొంటే సాగే విధుల్లో ఉండే సైనికులకు రక్షణ కల్పించడంతో పాటు సౌకర్యవంతంగా ఉండే వస్తువులు అవసరమవుతాయి. ఇందుకోసం అన్ని దేశాలు ప్రత్యేక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలను కూడా నిర్వహిస్తున్నాయి.

BIHAR SHOES : ఎల్లలు దాటిన వ్యాపారం.. రష్యా సైనికుల కాళ్లకు బీహార్ మహిళలు చేసిన బూట్లు..!
Bihar Shoes
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: May 18, 2024 | 3:41 PM

సామాన్యుల అవసరాలకు.. సైనికుల అవసరాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. క్లిష్టమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో నిత్యం ప్రమాదాలను ఎదుర్కొంటే సాగే విధుల్లో ఉండే సైనికులకు రక్షణ కల్పించడంతో పాటు సౌకర్యవంతంగా ఉండే వస్తువులు అవసరమవుతాయి. ఇందుకోసం అన్ని దేశాలు ప్రత్యేక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలను కూడా నిర్వహిస్తున్నాయి. భారత సైనికావసరాల కోసం ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్’ (DRDO) సహా అనేక సంస్థలు ఉన్నాయి. సియాచిన్ వంటి అత్యంత శీతల వాతావరణంలో పహారా కాసే సైనికుల కోసం ప్రత్యేక బలవర్ధక ఆహారం సహా అనేక పరికరాలను ఈ సంస్థ రూపొందించి అందిస్తూ ఉంటుంది.

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే..! గత రెండేళ్లుగా ప్రపంచంలో యుద్ధంలో మునిగిన రెండు దేశాల గురించి అందరికీ తెలుసు. 2002లో రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరువైపులా ఆస్తి, ప్రాణ నష్టాలు సైతం జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా సైనిక అవసరాలు కూడా పెరుగుతున్నాయి. రష్యా సైనికుల కోసం ఆ దేశం ఎన్ని వస్తువులు తయారు చేసి ఇస్తున్నా.. యుద్ధం నేపథ్యంలో తయారీ సామర్థ్యం మించి అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు తమ అవసరాలకు తగ్గట్టు తయారు చేసి అందజేసే నమ్మకమైన సంస్థలకు, దేశాలకు ఆర్డర్లు ఇస్తుంటాయి. ఇప్పుడు రష్యన్ ఆర్మీ ధరించే బూట్ల తయారీ విషయంలో ఇదే జరిగింది. వారి అవసరాలకు తగిన విధంగా బూట్లు తయారు చేసి అందజేసే కాంట్రాక్టును భారతదేశంలో బీహార్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ కైవసం చేసుకోవడం ఒకెత్తయితే.. ఆ సంస్థలో పనిచేసే సిబ్బందిలో 70 శాతం మంది మహిళలే కావడం మరో విశేషం.

అంతర్జాతీయ చిత్రపటంపై హాజీపూర్

బీహార్ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రాష్ట్ర రాజధాని పాట్నాతో పాటు హాజీపూర్ ఒకటి. తాజాగా ఈ నగరం అంతర్జాతీయ మార్కెట్లో స్థానం సంపాదించుకుంది. రష్యన్ సైన్యంతో పాటు యురోపియన్ మార్కెట్ అవసరాలను తీర్చే అనేక రకాల బూట్లు, డిజైనర్ షూ లు ఇక్కడ తయారవుతున్నాయి. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో.. మేడిన్ ఇండియా ఉత్పత్తుల సత్తా ఏంటన్నది ప్రపంచానికి చాటి చెబుతోంది. హాజీపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ “కాంపిటెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్” రష్యన్ ఆర్మీ కోసం బూట్లు తయారు చేస్తోంది.

2018లో ప్రారంభించిన ఈ సంస్థలో ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 70 శాతం మంది మహిళలేనని కంపెనీ జనరల్ మేనేజర్ శివ్ కుమార్ రాయ్ తెలిపారు. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి క్రమక్రమంగా మహిళల సంఖ్య పెరుగుతూ వచ్చిందని ఆయన వివరించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రష్యన్ సైనికుల అవసరాల కోసం సేఫ్టీ షూ (బూట్లు) తయారు చేయడంతో పాటు యూరప్ మార్కెట్ మార్కెట్ అవసరాలకు తగిన డిజైనర్ ఫుట్‌వేర్ కూడా తాము తయారు చేస్తున్నామని తెలిపారు.

రష్యా సైన్యం అవసరాల గురించి రాయ్ మాట్లాడుతూ.. అక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలం మన్నికతో పాటు రక్షణ కల్పించేలా బూట్లను తయారు చేశామని చెప్పారు. అక్కడ శీతాకాలంలో సైబీరియా సహా చాలా ప్రాంతాల్లో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో అతి శీతల వాతావరణం ఉంటుందని, మంచుతో కప్పుకుపోయిన మార్గాల్లో నడవడం వల్ల జారిపడిపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. అందుకే అతి శీతల వాతావరణానికి తగిన మెటీరియల్‌తో పాటు తేలికగా ఉండేలా.. అదే సమయంలో జారి పడిపోకుండా మంచి గ్రిప్ కలిగి ఉండేలా బూట్లను తయారు చేశామని రాయ్ వివరించారు. గతేడాది రూ.100 కోట్ల విలువైన 15 లక్షల జతల బూట్లను ఎగుమతి చేశామని, వచ్చే ఏడాది తమ వ్యాపారాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

కంపెనీ ఫ్యాషన్ విభాగం హెడ్ మజ్హార్ పల్లూమియా మాట్లాడుతూ.. యురోపియన్ మార్కెట్ అవసరాలకు తగిన లగ్జరీ డిజైనర్ ఫుట్‌వేర్ తయారుచేస్తున్నామని తెలిపారు. వాటిని ఇప్పటికే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే వంటి దేశాలకు వాటిని ఎగుమతి చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే బెల్జియన్ కంపెనీతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశానికి కూడా ఎగుమతి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. యురోపియన్ కంపెనీలు సహా విదేశీ సంస్థలు తొలుత తాము తయారు చేసిన వస్తువుల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదని, అయితే తాము కొన్ని శాంపిళ్లను పంపిన తర్వాత వాటిని బాగా ఇష్టపడ్డారని తెలిపారు.

తాము ఈ ఉత్పత్తులను ఎలా తయారు చేస్తున్నామో తెలుసుకోవాలన్న కుతూహలంతో కొన్ని కంపెనీలు వచ్చే నెలలో బీహార్‌కు రానున్నాయని వెల్లడించారు. నిజానికి బీహార్ వంటి వెనుకబడి రాష్ట్రంలో ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీ అన్నది పెద్ద సవాలు అని, అయితే సంస్థ వ్యవస్థాపకుల దూరదృష్టి, ప్రభుత్వ తోడ్పాటుతో తాము ముందుకు దూసుకెళ్తున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి