Watch Video: ఆ ఎంపీపై దాడి కేసులో మెడికల్ రిపోర్టు కీలకం.. బయటకు వచ్చిన మరో షాకింగ్ వీడియో..
ఆమ్‌ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ ఎపిసోడ్లో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్యూరిటీ బిభవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయన్ను అరెస్ట్ చేశారు. స్వాతి మలివాల్ మెడికల్ రిపోర్టులు విడుదల చేసింది ఎయిమ్స్.
ఆమ్‌ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ ఎపిసోడ్లో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్యూరిటీ బిభవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయన్ను అరెస్ట్ చేశారు. స్వాతి మలివాల్ మెడికల్ రిపోర్టులు విడుదల చేసింది ఎయిమ్స్. స్వాతి శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్టు పోలీసులకు రిపోర్ట్ సమర్పించింది. ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడించింది. ముఖంపై గాయాలతో పాటు శరీరం లోపల కూడా గాయాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు.
తనపై దాడి జరిగిందన్న స్వాతి మలివాల్ ఆరోపణలకు ఈ వైద్య నివేదిక బలం చేకూర్చే విధంగా ఉంది. విచారణలో భాగంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు వెళ్లారు. దాడి ఘటనకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు స్వాతీ మలివాల్‌కు సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటినుంచి ఆమెను భద్రతా సిబ్బంది బయటకు తీసుకొస్తున్న వీడియో ఇది. ఇందులో పోలీసులు, సెక్యూరిటీ అధికారులు ఆమెను బయటకు తీసుకొస్తున్నారు. ఈ వీడియోలో వారి నుంచి విడిపించుకునేందుకు స్వాతి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది.
మే 13న సీఎం ఇంట్లో తనపై దాడి జరిగిందని, తనకు గాయాలు అయ్యాయని మలివాల్ ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లిన తనపై.. ముఖ్యమంత్రి సహాయకుడు బిభవ్ కుమార్ తనను కాలితో తన్నాడని, బూతులు తిట్టాడని FIRలో పేర్కొన్నారు. ఈ దాడిలో తన బట్టలు కూడా చిరిగిపోయాయని, తలకు, కాలికి తీవ్రగాయమైందని పేర్కొంది. స్వాతీ మాలీవాల్‌పై దాడి ఘటన నిరాధారమైందని దిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. అపాయింట్‌మెంట్ లేకుండానే సీఎం నివాసానికి స్వాతి మాలీవాల్ వచ్చారని తెలిపారు. కేజ్రీవాల్‌ను కలవాలని స్వాతి పట్టుబట్టగా, ఆయన బిజీగా ఉన్నారని బిభవ్ కుమార్ చెప్పారన్నారు ఆతిశీ. ఆమె అరుస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని.. బిభవ్ కుమార్‌పై బెదిరింపులకు దిగినట్లు కనబడుతోందని చెప్పారు. తనను దారుణంగా కొట్టారని స్వాతి ఆరోపిస్తుంటే, వీడియోలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని తెలిపారు ఆతిశీ. దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న అనుమానాలు రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..