AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: ‘నా కొడుకును మీకు అప్పగిస్తున్నా…’ రాయ్‌బరేలీ ర్యాలీలో సోనియా గాంధీ భావోద్వేగం..!

రాయ్‌బరేలీకి తన తనయుడిని అప్పగిస్తున్నానని, తనను ఆదరించినట్లే రాహుల్‌ను కూడా అక్కున చేర్చుకోవాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ప్రజలను రాహుల్ ఎప్పటికీ నిరాశపరచడని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Sonia Gandhi: 'నా కొడుకును మీకు అప్పగిస్తున్నా...' రాయ్‌బరేలీ ర్యాలీలో సోనియా గాంధీ భావోద్వేగం..!
Priyanka Rahul Sonia Gandhi
Balaraju Goud
|

Updated on: May 17, 2024 | 7:54 PM

Share

రాయ్‌బరేలీకి తన తనయుడిని అప్పగిస్తున్నానని, తనను ఆదరించినట్లే రాహుల్‌ను కూడా అక్కున చేర్చుకోవాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ప్రజలను రాహుల్ ఎప్పటికీ నిరాశపరచడని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతకుముందు సోనియా గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు. రాహుల్ గాంధీకి మద్దతుగా బహిరంగ సభ నిర్వహించేందుకు సోనియా గాంధీ రాయ్ బరేలీకి వచ్చారు. బహిరంగ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ తల్లి సోనియా గాంధీ పక్కనే నిల్చున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ రాహుల్‌కు ఓట్లు వేయాలని కోరారు

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుదీర్ఘ కాలం పాటు రాయ్‌బరేలీ ఎంపీగా తనను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు సోనియా. రాయ్‌బరేలీతో తన కుటుంబానికి గాఢమైన అనుబంధం ఉందన్నారు. రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న రాహుల్‌ను తనలాగే ఆదరించాలని ఓటర్లను కోరారు. ప్రతి ఒక్కరినీ గౌరవించాలని, బలహీన వర్గాలను, రక్షించాలని, బలహీనులకు న్యాయం జరగాలంటే ఏమైనా పోరాడాలని, భయపడవద్దని రాహుల్‌కు ఎప్పుడూ చెబుతూనే ఉంటానని సోనియా గాంధీ అన్నారు. జీవితమంతా రాయ్ బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో ఒడి నిండిపోయిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు సోనియా.

రాయ్‌బరేలీ సభలో రాహుల్‌, ప్రియాంకతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. యూపీలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఉంది. ఈ ఎన్నికల్లో వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీలోనూ రాహుల్ ఎంపీగా పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన అమేథీ నుంచి ఓడిపోయి వయనాడ్‌నుంచి గెలిచారు. 2004 నుంచి వరుసగా 4 సార్లు రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా రాజస్థాన్‌నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అయితే, ఆయన వాయనాడ్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి కూడా రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాయనాడ్‌లో ఓటింగ్ ముగిసింది. రాయ్ బరేలీలో పోలింగ్ జరగాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…