ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. విచారణలో మైండ్ బ్లోయింగ్ నిజం.!

దొంగలను పట్టుకోవాల్సిన కొందరు ఖాకీలు.. దొంగపనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సొసైటీని క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిందిపోయి.. అత్యాశకు ఆశపడి.. చివరికి ఊసలు లేక్కపెడుతున్నారు. ఈ కోవలోనే ఓ చోరీ కేసులో రికవరీ చేసిన కిలోన్నర బంగారంలో నుంచి 582 గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు..

ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. విచారణలో మైండ్ బ్లోయింగ్ నిజం.!
Representative Image
Follow us

|

Updated on: May 18, 2024 | 8:59 AM

దొంగలను పట్టుకోవాల్సిన కొందరు ఖాకీలు.. దొంగపనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సొసైటీని క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిందిపోయి.. అత్యాశకు ఆశపడి.. చివరికి ఊసలు లేక్కపెడుతున్నారు. ఈ కోవలోనే ఓ చోరీ కేసులో రికవరీ చేసిన కిలోన్నర బంగారంలో నుంచి 582 గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. కోలార్ జిల్లా బంగారుపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన అనిల్ అనే పోలీసు కానిస్టేబుల్ ఈ పనికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 25న బంగారుపేట బస్ స్టేషన్‌లో బంగారం వ్యాపారి గౌతమ్ చంద్‌కు చెందిన 2 కిలోల బంగారం చోరీకి గురైంది. ఇక 1 కేజీ 408 గ్రాములు గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు ఖాకీలు.

బంగారం స్వాధీనం చేసుకున్న కొద్దిరోజుల అనంతరం ఆ గోల్డ్ నుంచి 582 గ్రాముల గోల్డ్ మాయమైంది. దీనిపై అనుమానపడ్డ పోలీసులు.. అసలు అంశంపై కూపీ లాగారు. గోల్డ్ మాయం అయిన రోజు నుంచి స్టేషన్‌లో పని చేస్తున్న క్రైమ్ కానిస్టేబుల్ అనిల్ 15 రోజులుగా కనిపించకుండాపోయాడని గుర్తించారు. దీంతో పరారీలో ఉన్న అతడ్ని వెతికి పట్టుకోగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్‌తో సహా మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని ఎస్పీ శాంతరాజు కేజీఎఫ్ డీవైఎస్పీని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం.. 

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.! వాతావరణశాఖ అలెర్ట్..
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగదు.! ప్రయాణికులకు నిరంతర సేవలు
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు ఏం చేశారో తెలుసా.? వీడియో
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
34 ఏళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన ఆ ముగ్గురు.!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!
వద్దన్నా అంటగట్టిన టికెట్‌కి రూ.26 లక్షల లాటరీ..!