ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..

జార్ఖండ్‌ మంత్రి ఆలంగీర్‌ ఆలంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. తన శాఖలోని ప్రభుత్వ టెండర్లలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్‌ రాజధాని రాంచీలో గుట్టలుగా 32 కోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. జార్ఖండ్‌ మంత్రి అలంగీర్‌ ఆలం పీఏ పనిమనిషి ఇంటి నుంచి ఈడీ అధికారులు 32కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
Alamgir Alam
Follow us
Srikar T

|

Updated on: May 18, 2024 | 6:28 AM

జార్ఖండ్‌ మంత్రి ఆలంగీర్‌ ఆలంపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. తన శాఖలోని ప్రభుత్వ టెండర్లలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్‌ రాజధాని రాంచీలో గుట్టలుగా 32 కోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. జార్ఖండ్‌ మంత్రి అలంగీర్‌ ఆలం పీఏ పనిమనిషి ఇంటి నుంచి ఈడీ అధికారులు 32కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో.. మనీలాండరింగ్‌ కేసులో అలంగీర్‌ ఆలంను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే.. మంత్రి ఆలంగీర్‌ను పీఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరుపర్చింది ఈడీ. అలంగీర్‌ ఆలంకు పీఎంఎల్‌ఏ కోర్టు ఆరు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా.. మంత్రి అలంగీర్‌ అవినీతి, అక్రమాలకు సంబంధించి కోర్టు కీలక విషయాలు వెల్లడించింది ఈడీ. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన ఝార్ఖండ్‌ మాజీ మంత్రి ఆలంగీర్‌ ఆలమ్‌.. ప్రభుత్వ టెండర్లలో భారీగా సొమ్ములు వసూలు చేసేవారని తెలిపింది. జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఏ టెండర్‌లోనైనా ఆలంగీర్‌కి 1.5 శాతం కమిషన్‌ ఇస్తేనే పనులు ముందుకు సాగేవని చెప్పింది.

ఆలంగీర్‌ పీఏ సంజీవ్‌కుమార్‌ లాల్‌ పని మనిషి ఫ్లాట్‌ నుంచి 32 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడమే అందుకు నిదర్శమని ఈడీ పేర్కొంది. గతంలో పనిమనిషి ఇంట్లో గుట్టలు గుట్టలుగా పట్టుబడిన నోట్ల కట్టల వీడియో పెద్ద ఎత్తున దుమారం రేగింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌ సొమ్ములు వసూలు చేసి పంచే బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్లు చూసుకునేవారని చెప్పింది. ఇలానే.. 2022 సెప్టెంబర్‌లో ఓ ఇంజినీర్‌ నుంచి 3 కోట్లు అందుకున్నట్లు తెలిపింది. 2020లో గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర రామ్‌పై కేసు నమోదు చేసింది. తన శాఖలో పనులు అప్పగించడానికి కాంట్రాక్టర్ల నుంచి రామ్‌ సొమ్ములు వసూలు చేసేవారని.. ఈ డబ్బు సేకరణకు అసిస్టెంట్‌ ఇంజినీర్లు సాయం చేసేవారని ఈడీ పీఎంఎల్‌ఏ కోర్టుకు వెల్లడించింది. భారీ మొత్తంలో నగదు తీసుకొని.. ఆ తర్వాత వాటితో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టం చేసింది. ఈ అక్రమాల వ్యవహారంలో జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉద్యోగులున్నారని ఈడీ చెప్పడం సంచలనంగా మారింది.